
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభం
రాయవరం: ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రతి నెలా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు 50 శాతం మంది పాల్గొనగా, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల్లో భాగంగా తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 47, తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు 21, వ్యాయామ ఉపాధ్యాయులకు 7 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. వీటిని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment