
పాఠశాల కమిటీల్లో పచ్చపాతం
ఆత్రేయపురం: పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ‘పచ్చ’పాతం చూపారు.. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలిస్తే, అధికారులు మాత్రం డిపాజిట్ ఓట్లు కూడా దక్కించుకోలేని టీడీపీ నేత గెలిచినట్లు ప్రకటించారు. దీంతో ఈ పాఠశాల తమకొద్దు.. తమ పిల్లల టీసీలు ఇచ్చేయండంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. టీసీల కోసం దరఖాస్తులను హెచ్‌ఎమ్ సత్యనారాయణకు సమర్పించారు. ఇదంతా ఆత్రేయపురం పెదహరిజన వాడలో మండల పరిషత్ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆత్రేయపురం పెదహరిజన వాడ మండల పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా 15 మంది ఓటర్లుగా గుర్తించారు. ఇందులో 12 మంది వైఎస్సార్ సీపీ బలపర్చిన అభ్యర్థికి అనుకూలంగా వేశారు. కేవలం 3 ఓట్లు మాత్రమే అధికార టీడీపీ బలపర్చిన అభ్య ర్థికి లభించాయి. గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థిని కాకుండా టీడీపీ బలపర్చిన అభ్యర్థిని విజేతగా అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. అయినా సరే అధికారులు అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
టీసీలు ఇప్పించండి
ఓటమి పాలైన అధికార పార్టీ నేతను విజేతగా ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు తక్షణమే పాఠశాల నుంచి టీసీలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులను హెచ్‌ఎం సీహెచ్ సత్యనారాయణకు అందజేయబోగా.. ఆయన వాటిని తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులంతా తమ పిల్లలతో వెళ్లి ఎంఈఓ వరప్రసాద్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. టీసీలు మంజూరు చేసేందుకు వారూ నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళన కొనసాగించారు. 24 గంటల్లో తమ పిల్లల టీసీలు ఇవ్వకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా, 15 మంది టీసీలు ఇవ్వాలని అధికారులను పట్టుబడుతున్నారు. దీనిపై ఎంఈఓ వరప్రసాద్‌ను వివరణ కోరగా, చైర్మన్ ఎన్నికలపై జరిగిన ఆందోళన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినా మంజూరు చేయలేదన్నారు. శుక్ర, శనివారాల్లో తల్లిదండ్రులతో సామరస్యంగా చర్చిస్తామన్నారు. ఒకేసారి 12 మంది విద్యార్థులకు టీసీలను మంజూరు చేస్తే తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందన్నారు.
ఫ ఆత్రేయపురంలో
అధికారుల అత్యుత్సాహం
ఫ చైర్మన్‌గా గెలిచింది వైఎస్సార్ సీపీ నేత
ఫ కానీ టీడీపీ అభ్యర్థికి
పట్టం కట్టిన అధికారులు