
జగన్‌ను అభినందిస్తున్న హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లి జవహర్‌లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి అప్పారి జగన్ జాతీయ బాస్కెట్‌బాల్ అండర్–17 పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.ఘన సత్యనారాయణ తెలిపారు. ఇటీవల రాయవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో సత్తా చాటిన జగన్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 27వ తేదీన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో జరగనున్న జాతీయ అండర్ –17 బాస్కెట్ బాల్ పోటీల్లో తలపడనున్నాడని చెప్పారు. జాతీయ పోటీలకు ఎంపికై న జగన్‌ను పాఠశాలలో సోమవారం జరిగిన అభినందన సభలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జగన్‌ను డీఈవో ఎం.కమలకుమారి, అమలాపురం డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశం, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచిగంటి వెంకటేశ్వరరావు అభినందించారు.