
ఉచిత విద్యకు ఆహ్వానం
రాయవరం: చదువుకు అంతరాలు, అడ్డుగోడలు ఉండకూడని ఆలోచించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను పక్కాగా అమలు చేసింది. దీనికి అనుగుణంగా ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేందుకు 2022–23 విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. ఆ విద్యా సంవత్సరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 570 మందికి సీట్లు కేటాయించారు. ఆ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించేలా నోటిఫికేషన్ విడుదల చేశారు.
నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో అర్హులైన చిన్నారులకు ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు శనివారం నుంచి సీఎస్‌ఈ వెబ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకు అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వారి నివాసానికి సమీపంలో ఉండే పాఠశాలను ఎంపిక చేసుకునే వీలుంది. అనాథలు, హెచ్‌ఐవీ ఎఫెక్టెడ్, డిజేబుల్డ్ వారికి ఐదు శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు నాలుగు శాతం, బీసీలు, మైనార్టీలు, ఇతరులకు ఆరు శాతం సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.1.44 లక్షల ఆదాయానికి మించి ఉండకూడదు.
పేదలకు వరం
అందరికీ విద్య అందించేందుకు విద్యా హక్కు చట్టం మేరకు పేదలకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి అవకాశం కల్పించింది. ఇది పేద విద్యార్థులకు వరం వంటిది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులతో తల్లిదండ్రులు దరఖాస్తు చేయించాలి.
& h.¯é-VýS-Ð]l$×ìæ, BÆó‡jyîl, ˘
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
ప్రతి పాఠశాల రిజిస్టర్ కావాలి
విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. పేద విద్యార్థులకు 1వ తరగతిలో ప్రవేశానికి చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చే విద్యా సంవత్సరం కోసం విడుదల చేశారు.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం
పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు
నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ
నేటి నుంచి
పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రక్రియ