అన్నవరం: రత్నగిరి దుర్గామాత శ్రీ వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం వనదుర్గ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పండితులు పూజించారు. ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి. యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, ప్రథమశ్రేణి వ్రత పురోహితులు నాగాభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకులు కోట వంశీ, పరిచారకులు పవన్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
నేడు అమ్మవారికి చండీహోమం
శ్రావణ పౌర్ణిమ సందర్భంగా సోమవారం జరిగే చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంతో వనదుర్గ అమ్మ వారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. ఉద యం తొమ్మిది గంటలకు చండీహోమం ప్రారంభమ వుతుంది. 11 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్ర మంలో రుత్విక్కులు హోమద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆశీస్సులు, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment