
శ్రీ ప్రకాష్‌లో నృత్య సంధ్య వేడుకలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నృత్య సంధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మానవుని మేధస్సు నుండి ఉద్భవించిన అద్భుత విషయాలలో కళ ఒకటని, కళను అదరించడం, అభిమానించడం కళాత్మకతకు అద్దం పడతాయన్నారు. తెలుగు సాహిత్యంలో కవిత్వానిది ప్రత్యేక స్థానమని, పద్యం రాయడం ఒక తపస్సు అయితే, పదమును గానం చేయడం తపమేనన్నారు. కలరీ పయట్టు అనే ప్రాచీన యుద్ధ విద్యకు సంబంధించి విన్యాసాలను కేరళకు చెందిన కృష్ణదాస్, కుమార్తె కావ్యలు 45 రోజుల పాటు విద్యార్థులకు నేర్పించి మంచి ప్రదర్శన ఇవ్వడం సంతోషమన్నారు. పాఠశాల డైరక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ సాంప్రదాయ విలువలు, సంస్కృతి పునాదులుగా చేసుకుని భారతీయతకు అద్దం పడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థుల భవితకు బాటలు వేయడమే శ్రీప్రకాష్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.