
విజన్ కార్యాచరణ తయారు చేయాలి
అమలాపురం రూరల్: వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు వచ్చే ఐదేళ్లకు జిల్లా కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో శాఖల వారీగా జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరికీ ఈ నెల 21 నుంచి 31 వరకూ రాష్ట్ర స్థాయిలో సంబంధిత హెచ్‌ఓడీల సమావేశాలు నిర్వహించి, తమ శాఖల ప్రణాళికను రూపొందించడానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్, అగ్రికల్చర్ జేడీ బోసుబాబు పాల్గొన్నారు.
సోలార్ రూఫ్‌టాప్‌లు నిర్మించుకోవాలి
పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్‌లను నిర్మించుకోవడం ద్వారా 300 యూనిట్ల వరకూ విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన క్యూఆర్ కోడ్ సెల్ఫీ స్టాండ్‌ను ఆయన పరిశీలించారు. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానల్‌లను ఏర్పాటు చేసుకుంటే రూ. 30 వేల వరకూ రాయితీ అందిస్తుందని, రెండు కిలోవాట్ల సామర్థ్యానికి రూ. 60 వేలు, మూడు కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ అందిస్తుందన్నారు. ఈ పథకం కింద సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment