
మహిళా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
అమలాపురం టౌన్: జిల్లాలో మహిళలు, బాలలు, యువతులు వివిధ సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులపై మహిళా పోలీసులు తక్షణమే స్పందించాలని ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు మహిళా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధుల బృందం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మహిళా పోలీసు బృందంతో ఎస్పీ కొద్దిసేపు మాట్లాడారు. మహిళా పోలీసులు తమ సమస్యలను ఎస్పీ ముందు ఉంచి వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా మహిళా పోలీసుల అసోసియేషన్ అధ్యక్షురాలు కొప్పిశెట్టి వెంకట ధనలక్ష్మి ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటు నాగ సుశీల, అదనపు ప్రధాన కార్యదర్శి టి.రాజేశ్వరి, కార్య నిర్వాహక ఉపాధ్యక్షురాలు ఎన్.ఝాన్సీ, సంయుక్త కార్యదర్శి జి. శ్రీకావ్య, కార్యవర్గ సభ్యులు సమనస పద్మ, రెడ్డి సువర్ణ లక్ష్మి, కె.శైలజ, జె.లక్ష్మి, ఎస్‌కే గౌస్య, తేజస్వి తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.
జిల్లా ఎస్పీ కృష్ణారావు