రాయవరం: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీల షెడ్యూల్, మార్గదర్శకాలతో జీఓ 75ను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరగనున్నాయి. అయితే బదిలీలను కేవలం 15 శాఖలకే పరిమితం చేశారు. రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్), పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఇన్‌క్లూడింగ్ సెర్ఫ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్‌డబ్ల్యూఎస్, సివిల్ సప్లయిస్, మైనింగ్ అండ్ జియాలజీ, ఇంజినీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్‌మెంట్స్, దేవదాయ, రవాణా, పరిశ్రమలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్, కమర్షియల్ టాక్స్, ఎకై ్సజ్, ఈఎఫ్‌ఎస్ అండ్ టీ శాఖల్లో బదిలీలు జరగనున్నారు. ఈ ఏడాది జూలై 31 నాటికి ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. మిగిలిన వారు జీరో సర్వీస్‌పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులవుతారు.
ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది. ఈ నెల 19 నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం కొనసాగుతుంది. కాగా ఉపాధ్యాయులు మాత్రం ఈ బదిలీ ఉత్తర్వుల పరిధిలోకి రారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్నికల నిబంధనల్లో భాగంగా రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు బదిలీలకు నోచుకోగా, ఇటీవలే వారిని తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.
ఫ ప్రభుత్వ జీవో విడుదల
ఫ 15 శాఖలలో బదిలీలకు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment