
కిక్కిరిసిన శృంగార వల్లభుని ఆలయం
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయం భూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు బారులు తీరారు. శనివారం కావడంతో అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవలు, టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా రూ. 2,97,678 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 18 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా, నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు.