ఏలేశ్వరం: మండలంలోని మర్రివీడు గ్రామంలో ఏలేరు ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన కాలువలో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేవు. దుండుగులు హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఉదయం కాలువ పక్కనుంచి వెళుతున్న మత్స్యకారులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, హత్య జరిగి వారం రోజులు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. మొండెం మాత్రమే లభ్యం కావడంతో కాలువ ఎగువ ప్రాంతాలైన అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల నుంచి కొట్టుకువచ్చిందా లేదా మైదాన ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఫ హత్యచేశారని పోలీసుల అనుమానం
Comments
Please login to add a commentAdd a comment