
రైలు కిందపడి ఆత్మహత్య
తుని: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై షేక్ అబ్దుల్ మారూఫ్ శనివారం తెలపారు. ఆ వివరాల్లోకెళ్తే.. తుని మండలం సూరవరం గ్రామానికి చెందిన వజ్రపు భాను పద్మేశ్వరరావు (19) ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. స్థానిక రైల్వే పెద్ద గేటు సమీపంలో తుని నుంచి అన్నవరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
శృంగార వల్లభునికి రూ.2.69 లక్షల ఆదాయం
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి 2,68,814 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, సుమారు నాలుగు వేల మంది భక్తులు అన్నదానం స్వీకరించారని పేర్కొన్నారు.

రైలు కిందపడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment