
మందపల్లిలో శని త్రయోదశి పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి పర్వదినం కలసి రావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో భక్తుల పూజలు, దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.13,89,710, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.57,700 ఆదాయం వచ్చిందని ఈఓ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ దంపతులు మందపల్లి శనైశ్చరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరఫున స్వాగతం పలికారు. పూజాధికాల అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందించి, శాలువాతో సత్కరించారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ, తహసీల్దార్ వై.రాంబాబు, ఆర్‌ఐ కె.ఏడుకొండలు తదితరులు ఉన్నారు.
డివైడర్‌ను దాటి.. ముగ్గురిని ఢీకొట్టి
ఆలమూరు: ఓ వ్యాన్ డివైడర్‌ను దాటొచ్చి రెండు బైక్‌లను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పెల్లకు చెందిన ఆకులు వెంకన్న (45), అడబాల సత్యనారాయణ (57)లు ఓ బైక్ వస్తుండగా, చిక్కిరెడ్డి రాజు (32) మరో బైక్‌పై ఆగి ఉన్నారు. వీరు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. జొన్నాడ నుంచి రాజమహేంద్రవరం వైపు ఇటుక లోడుతో వెళ్తున్న వ్యాన్ ఇక్కడి కొండలమ్మ గుడి జంక్షన్‌కు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ దాటుకుంటూ వచ్చి వీరి బైక్‌లను ఢీకొంది. అనంతరం మరో వాహనం దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ప్రమాదంలో పై ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై ఎం.అశోక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే హైవే, 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లూ నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో సత్యనారాయణ, వెంకన్న పరిస్థితి విషమంగా ఉందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరో క్షతగాత్రుడు చిక్కిరెడ్డి రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి మృతి
కాజులూరు: గొల్లపాలెంలోని కాజులూరు రోడ్ జంక్షన్‌లో శనివారం హెరిటేజ్ పాల వ్యాన్ సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్యావటం శివారు ముత్తావారిగరువుకు చెందిన కోట వెంకట్రావు (70) ఐస్‌క్రీమ్ వ్యాపారం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన సైకిల్‌పై గొల్లపాలెం నుంచి ఇంటికి వెళ్తుండగా కాజులూరు రోడ్ జంక్షన్‌లో ఎదురుగా వస్తున్న హెరిటేజ్ పాల వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకట్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.తులసీరామ్ దర్యాప్తు చేస్తున్నారు.
ఫ బైక్‌లను ఢీకొన్న వ్యాన్
ఫ ఒకరికి తీవ్ర గాయాలు
ఫ ఇద్దరి పరిస్థితి విషమం

మందపల్లిలో శని త్రయోదశి పూజలు

మందపల్లిలో శని త్రయోదశి పూజలు
Comments
Please login to add a commentAdd a comment