
ఉలిమేశ్వరంలో ఇరువర్గాల దాడి
పెద్దాపురం: మండలంలోని ఉలిమేశ్వరంలో ఇరువర్గాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన దాడుల్లో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇరువురు యువకుల మధ్య జరిగిన సంభాషణ చిలికి చిలికి ఇరువర్గాల దాడులకు దారి తీసిందన్నారు. గ్రామ వైఎస్సార్ సీపీ సర్పంచ్ ఆకుల వరలక్ష్మి స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తుండగా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పేకేటి దొరబాబు స్థానిక యువతతో వ్యక్తిగత తగదాల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పల్నాటి శివ, పల్నాటి వెంకటరమణ తదితరులతో వివాదానికి దిగారు. అక్కడే ఉన్న సర్పంచ్ భర్త వీరబాబు ఇది పద్ధతి కాదని వారిని వారించి అక్కడి నుంచి పంపేయడంతో ఉదయం ఎవరికి వారు వెనుదిగారు. సాయంత్రం సమయంలో గ్రామ సెంటర్‌లో అందరూ ఉండగా అక్కడ ఉన్న ఓ పెద్దాయన కురెమెళ్ల మూలయ్య చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెంకటరమణ, శివలపై దొరబాబు, ఆయన తమ్ముడు రామచంద్రరావు తీవ్ర పదజాలంపై కర్రలు, కత్తితో దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై ఎస్‌ఐ మౌనికను వివరణ కోరగా ఇరువర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment