
టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
అయినవిల్లి: మండల కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్‌లోని దేవీగణేష్ ప్లాజాలో ఉన్న టిఫిన్ హోటల్‌లో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి స్థానికులు, హోటల్ యజమాని, అమలాపురం ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్తేశ్వరం సెంటర్‌లోని దేవీ గణేష్ ప్లాజాలో నిర్వహిస్తున్న చిట్టూరి ఏడుకొండలుకు చెందిన హోటల్‌లో టిఫిన్లు తయారు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ యజమాని, సిబ్బంది అక్కడి నుంచి దూరంగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో టిఫిన్ తయారీకి సంబంధించిన సామాన్లు, విద్యుత్ పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబుడిదయ్యాయి. స్థానికుడు పాస్టర్ పాల్ ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపారు.
రూ.1.5 లక్షల అస్తిష్టం
Comments
Please login to add a commentAdd a comment