
సూక్ష్మ కళతో దేశభక్తి
● చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై
జాతీయ జెండా రూపకల్పన
గండేపల్లి: చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై జాతీయ జెండాను చెక్కి తన దేశ భక్తిని చాటుకున్నాడు ద్రాక్షారామకు చెందిన పెంకే కృష్ణ స్వామి. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్సీ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన దేశ భక్తిని చాటుకున్నారు. జెండాను ప్రదర్శిస్తున్నట్టుగా చాక్ పీస్‌పై, పెన్సిల్ ముల్లుపై ఎగురుతున్న జాతీయ జెండాను చెక్కాడు. సహోపాధ్యాయులు, విద్యార్థులు స్వామికి అభినందనలు తెలియజేశారు. ఆయన గతంలో పెన్సిల్, చాక్ పీస్, ఆకులపై పలువురి దేశ నేతలు, రాజకీయ నాయకుల చిత్రాలను గీసి తన ప్రతిభను చాటుకున్నారు.

సూక్ష్మ కళతో దేశభక్తి

సూక్ష్మ కళతో దేశభక్తి
Comments
Please login to add a commentAdd a comment