
పెరిగిపోతున్న కూటమి అరాచకాలు
రాజోలు: కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, విద్యుద్దీపాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తాటిపాక సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను నిరంతరం స్మరించుకునేందుకు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని, ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని, భౌతికదాడులతో పాటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మట్టా శైలజ, మాజీ ఏఎంసీ చైర్‌పర్సన్ గుబ్బల రోజారమణి, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, కోటిపల్లి ఏస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గొల్లపల్లి