
అగ్ని ప్రమాదంలో లారీ, బైక్ దగ్ధం
మండపేట: పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మెకానిక్ షెడ్డు వద్ద గురువారం మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లారీ, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం బైపాస్ రోడ్డులోని గంగరాజు మెకానిక్ షెడ్‌లో లారీ మరమ్మతుల్లో భాగంగా గ్యాస్ కటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకుకు లీకేజీ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. లారీకి సమీపాన ఉన్న బైక్ సైతం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన లారీ రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన అబ్బిరెడ్డి సింహాచలానికి చెందినదిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment