
వరి వడిగా..
పిఠాపురం: వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జోరుగా వరినాట్లు జరుగుతున్నాయి. పొలాల్లో పనులు చేస్తున్న కూలీలలో పల్లెలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా గొల్లప్రోలు మండలంలో ఉత్సాహంగా సాగు పనులు జరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలోని మెట్ట భూముల్లో వాణిజ్య పంటలను, మాగాణీ భూములతో వరిని పండిస్తున్నారు. ఈ పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా మారారు. కాగా.. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో నాట్లు దశలోనే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వరినాట్లు 90 శాతం పూర్తవ్వగా, వాణిజ్య పంటల సాగు చివరి దశకు చేరుకుంది. వర్షాల వల్ల నీట మునిగిన పంటలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. దెబ్బతిన్న పంటలను కాపాడుకునే పనిలో రైతులు ఉన్నారు. మరో పక్క ఇంకా నాట్లు పడని ప్రాంతాల్లో నాట్లు వేసే పనులు ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment