
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష సాయం
కాట్రేనికోన: ిప.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరం డొక్కా సీతమ్మ కాలనీకి చెందిన కొల్లు రవీంద్ర (21) రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ముమ్మిడివరం నియోజకవర్గం పల్లం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువత సాయం అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలనే తపనతో స్నేహితులంతా కలసి రూ.లక్ష సేకరించి అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన యువకుల్లో అవనిగడ్డ నారాయణమూర్తి, మల్లాడి దయ, అవనిగడ్డ శ్రీరాములు, బొమ్మిడి శ్రీరాములు, రాజు, శంకర్, నాయకర్, రామరాజు, వీరబాబు తదితరులు ఉన్నారు.
జిల్లా ఏఎస్పీగా ప్రసాద్
అమలాపురం టౌన్: జిల్లా ఏఎస్పీ (అడ్మిన్)గా ఏవీఆర్‌పీబీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన ఎస్.ఖాదర్ బాషాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బాషాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్యార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. నెల్లూరు జిల్లా క్రైం విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న ప్రసాద్ జిల్లాకు వస్తున్నారు. ఆయన రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని స్థానిక ఎస్పీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ బాషా ఏడాదిన్నర కిందట బాధ్యతలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక ప్రసాద్ మూడో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
చవితి ఏర్పాట్లకు శ్రీకారం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 15 వరకూ నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం శ్రీకారం చుట్టారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే ఉత్సవాలకు నాంది పలికారు. గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బయ్యా చినబాబు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ ఆలయంలో
భక్తుల సందడి
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శ్రావణ మాసం సందర్భంగా శనివారం భక్తులతో సందడిగా మారింది. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,17,707 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. ఇందులో లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,30,798, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.86,909 విరాళంగా అందించారు. 3,671 మంది స్వామి వారిని దర్శించుకోగా, 2,948 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు పాశర్లపూడిబాడవకు చెందిన కాండ్రేగుల వెంకటేశ్వరరావు, సూర్యావతి దంపతులు రూ.11,111 విరాళంగా సమర్పించారు.

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష సాయం

కిడ్నీ బాధితుడికి రూ.లక్ష సాయం
Comments
Please login to add a commentAdd a comment