వినాయక ప్రతిమావంతులు..! | - | Sakshi
Sakshi News home page

వినాయక ప్రతిమావంతులు..!

Published Fri, Aug 16 2024 10:44 AM | Last Updated on Fri, Aug 16 2024 10:44 AM

వినాయ

వినాయక ప్రతిమావంతులు..!

చవితి ఉత్సవాలకు విగ్రహాలు సిద్ధం

కళా కౌశలం ప్రదర్శిస్తున్న

రాజస్తాన్‌, బెంగాల్‌ కళాకారులు

వేల సంఖ్యలో వస్తున్న ఆర్డర్లు

మట్టి విగ్రహాలకు పెరిగిన గిరాకీ

జిల్లాలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌

(పీఓపీ) విగ్రహాల తయారీ

రాజస్తాన్‌, బెంగాల్‌ నుంచి వచ్చే

కుటుంబాలు – 350

తయారు చేసే విగ్రహాలు – 50 వేలకు పైగానే

పని చేస్తున్న కార్మికులు – 850 మంది

ఏటా విక్రయాలు – రూ.15 కోట్లకు పైగా

విగ్రహాల పరిమాణం – అడుగు నుంచి 25 అడుగులకు పైగా

ధర – రూ.5 వేల నుంచి లక్ష వరకు

మట్టి విగ్రహాల తయారీ

తయారు చేసే వారు – బెంగాల్‌ కార్మికులు

విగ్రహాల ధర – రూ.10 నుంచి

రూ.13 వేల వరకు

తయారు చేస్తున్న ప్రాంతం – పిఠాపురం

పిఠాపురం: ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్యా అంటు ఉత్సవ నిర్వాహకులు వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతుంటే ఓ బొజ్జ గణపయ్య మా బొజ్జ నింపయ్యా అంటూ విగ్రహ తయారీదారులు కోరుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దగ్గర పడుతుండడంతో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లో రాజస్థాన్‌, అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు వినాయక విగ్రహాల తయారీ దారులు ఇప్పటికే వందల సంఖ్యలో సిద్ధం చేశారు. కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న రంగు రంగుల విగ్రహాలను మండపాలలో నిలిపేందుకు వివిధ పరిమాణాల్లో నిలబెట్టేందుకు జోరుగా విక్రయాలు సాగుతున్నాయి.

కుటుంబ సమేతంగా..

రాజస్థాన్‌కు చెందిన కళాకారులు తమతమ కుటుంబాలతో సహా వివిధ జిల్లాలకు ఆరు నెలల ముందుగానే వచ్చి విగ్రమాల తయారీ ప్రారంభించారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో ముఖ్య కూడళ్ల సమీపంలో ఖాళీ ప్రదేశాన్ని అద్దెకు తీసుకుని భారీ గుడారాలు వేసి అక్కడే నివసిస్తూ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుటుంబంలో అందరు కలిసి పని చేస్తుంటారు. సిద్ధం చేసిన విగ్రహాలను వినాయక చవితి వరకు విక్రయించి తరువాత తమ స్వగ్రామాలకు వెళ్లి పోతారు. కొందరైతే ఇక్కడే ఉండిపోయి ఇతర చిన్న విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటూ ఉండిపోతున్నారు.

భారీ విగ్రహాలకు పెరిగిన ఆదరణ

గతంలో 2 నుంచి 5 అడుగుల మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వగా, కొన్నేళ్ల నుంచి ఉత్సవ కమిటీల మధ్య పోటీ పెరిగి ఒకరిని మించి ఒకరు భారీ పరిమాణంలో విగ్రహాలు నిలబెడుతున్నారు. దీంతో అడుగు నుంచి 25 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు తయారు చేయాలని రెండు నెలల ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు. భారీ విగ్రహాలు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండగా వేలల్లో వీటికి ఆర్డర్లు రావడం గమనార్హం. మరీ భారీ పరిమాణంలో కావాలనుకున్న వారికి మండల పాల వద్దే కార్మికులు తయారు చేసి ఇస్తున్నారు. వీటి విలువ రూ.లక్షకు పైగానే ఉంటుందని తయారీ దారులు చెప్తున్నారు.

మట్టి విగ్రహాలకు పెరుగుతన్న ఆదరణ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ ఎక్కువగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) తో చేసిన వాటికే గిరాకీ ఉంటోంది. ఆలయాలు, ఇళ్ల వద్ద మాత్రం మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తుండగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మండపాల వద్ద మాత్రం పీఓపీతో చేసిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అతి బారీ పరిమాణంలో విగ్రహాలతో పాటు ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది పిఠాపురంలో మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించడంతో వాటికి ప్రాధాన్యం పెరిగింది.

కళా నైపుణ్యం అంతా చేతితోనే..

మాది బెంగాల్‌ ఎన్నో ఏళ్లుగా మా కుటుంబ అంతా ఇదే పనిలో ఉన్నారు. గతంలో పీఓపీతో విగ్రహాలు తయారు చేసే వాళ్లం. పర్యావరణవేత్త, ప్రకృతి వ్యవసాయ వేత్త విజయ్‌రాం సూచనల మేరకు ఈ ఏడాది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మట్టి విగ్రహాలను చేతితోనే చేయాల్సి ఉంటుంది. వీటికి మౌల్డ్‌లు ఉండవు. ప్రతీ అవయవం మట్టితో నైపుణ్యంగా తయారు చేయాల్సి ఉంటుంది. నెల రోజులుగా మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించాం. ఒక విగ్రహం తయారు చేయడానికి ముగ్గురు కార్మికులు కష్టపడితే ఒక రోజులో పూర్తవుతుంది.

– సంతోన్‌, మట్టి విగ్రహాల తయారీ కార్మికుడు,

బెంగాల్‌ గ్యారీ బాయ్‌ విగ్రహ తయారీదారు, రాజస్థాన్‌

పీఓపీతో చేసినవే అడుగుతున్నారు

ఎక్కువగా పెద్దపెద్ద మండపాలలో నిలిపేందుకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసినవే అడుగుతున్నారు. ముందుగా వచ్చి వివిధ భంగిమలలో తయారుచేయాలని ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఏడాది ఎక్కువగా పెద్ద విగ్రహాలకు గిరాకీ ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విగ్రహాలు కొని తీసుకెళుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంత ఇబ్బందిపడినా ఎక్కువగానే విగ్రహాలు తయారు చేశాం. దానికి తగ్గట్టుగానే విక్రయాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెరగడంతో లాభాలు తక్కువగా ఉంటాయి.

– సోనా రామ్‌ విగ్రహ తయారీదారుడు, రాజస్థాన్‌

పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది మట్టి విగ్రహాల తయారీ పిఠాపురంలో ప్రారంభించాం. కేవలం మట్టి గోనె సంచులు మాత్రమే ఉపయోగించి మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా తయారు చేయిస్తున్నాం. విగ్రహాలు కేవలం మట్టి రంగులోనే ఉంటాయి ఏ విధమైన రంగులు వేయరు. ఆకర్షణ కోసం వరి పిండి పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. ఈ మట్టి విగ్రహం ఎక్కడైనా ఏ నీటిలో అయినా నిమజ్జనం చేయవచ్చు. కేవలం 3 రోజుల్లో పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హానీ ఉండదు. విగ్రహాలు కొనుగోలు చేసిన వారికి విగ్రహంతో పాటు బియ్యం, గొడుగు, బెల్లం, పంచె ఇస్తున్నాం. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో పండించినవే. పంచె చేనేత వస్త్రం మాత్రమే ఇస్తున్నాం. ప్రస్తుతం వీటికి గిరాకీ బాగానే ఉంది ఇప్పటి వరకు సుమారు 130 విగ్రహాలకు ఆర్డర్లు వచ్చాయి. కళాకారుల నైపుణ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వీటిని ప్రోత్సహిస్తే వచ్చే ఏడాది మరిన్ని మట్టి విగ్రహాల తయారీకి చర్యలు తీసుకుంటాము.

– విజయ్‌రాం, ప్రకృతి వ్యవసాయ వేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
వినాయక ప్రతిమావంతులు..!1
1/4

వినాయక ప్రతిమావంతులు..!

వినాయక ప్రతిమావంతులు..!2
2/4

వినాయక ప్రతిమావంతులు..!

వినాయక ప్రతిమావంతులు..!3
3/4

వినాయక ప్రతిమావంతులు..!

వినాయక ప్రతిమావంతులు..!4
4/4

వినాయక ప్రతిమావంతులు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement