అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకదశ రుద్రాభిషేకాల్లో 34 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. 20 మంది తమ నూతన వాహన పూజలు నిర్వహించారు. 24 చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1384 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,07,312 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ముమ్మిడివరం వాస్తవ్యులు ముళ్లపూడి శ్రీగణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సొమ్మును ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దాతను వేదపండితులు వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం ప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment