
జాతీయస్థాయి ప్రదర్శనలు అభినందనీయం
సాక్షి అమలాపురం: జైపూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెర్స జాతీయస్థాయిలో స్కూల్ ఇన్నోవేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇన్నోవేటివ్ కాంటెస్ట్ 2024’కు తొండవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన దాదాపు రెండువేల ఎంట్రీలలో ఈ పాఠశాలకు చెందిన ఎన్. శ్రీరామ్, శ్రీమనస్విని, పార్వతి ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విద్యార్థుల ప్రయోగాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల మెంటర్ గణేష్ నరసింహారావు నేతృత్వంలో విద్యార్థులు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. జాతీయస్థాయికి కౌన్సిల్ ఏఐసీటీఈ నుంచి రూ.94 వేలు గ్రాంట్ పొందిన ఏకై క ప్రాజెక్టుగా నిలిచిందన్నారు. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాకై ్సడ్ నుంచి ఎదురయ్యే కాలుష్యాన్ని విద్యార్థులు తయారు చేసిన చిమ్నీ (ఫిల్టర్) కొంత వరకు నియంత్రిస్తుందని తెలిపారు.
కుట్టి క్లీనర్ రోబోకు అభినందన
ఉప్పలగుప్తం: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగం వైపు దృష్టి సారించి జాతీయ స్థాయి అటల్ మారథాన్ పోటీల్లో 376వ స్థానాన్ని దక్కించుకోవడం అభినందనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ పోటీల్లో ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కిట్టీ ఫ్లోర్ క్లీనర్ రోబోట్ 2024 శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు నూకల రేవతి భాను, మదిరి తనుష్ తేజ ప్రదర్శించి విధివిధానాలను కలెక్టర్‌కు వివరించారు.