
వ్యక్తి ఆత్మహత్య
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోణాల ఏడుకొండలు (43) తన ఇంట్లో ఈ నెల 16న రాత్రి ఉరివేసుకుని మృతి చెందాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల అతని భార్య ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఏడుకొండలు తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని కుమార్తె పావని ఫిర్యాదు మేరకు అంగర ఇన్‌చార్జి ఎస్సై సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.