సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృత దేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసు కథనం ప్రకారం పిఠాపుం–సామర్లకోట కేఎం నెంబరు 630/–34–40 పోస్టుల మధ్య ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రైల్వే ఏఎస్‌ఎం జీకేఎస్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. తలకు ఎడమ వైపు గాయం ఉన్నదని, మృతుడు చామనచాయ రంగులో ఉండి కుడి చాతిపై పుట్టుమచ్చ, బొడ్డు దిగువ భాగంలో మరో పుట్టు మచ్చ ఉండి, తెలుపు షర్టు నీలం గళ్ల లింగి ధరించి ఉన్నాడని చెప్పారు. రైల్వే ఎస్సై బి.లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.
రత్నగిరిపై మరొకరు..
అన్నవరం: రత్నగిరిపై తూర్పు రాజగోపురం దిగువన గల ఘాట్‌రోడ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతని వయసు 55 ఏళ్లు ఉంటాయని, తెల్ల చొక్కా, కాషాయం రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ప్రత్తిపాడు ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment