
యువకుడి మృతదేహం లభ్యం
కె.గంగవరం: కోటిపల్లిలోని గౌతమి గోదావరి నదిలో శుక్రవారం సాయంత్రం స్నానానికి దిగి కుందూల నరేంద్ర (25) గల్లంతయ్యాడు. రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు. స్నానానికి దిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో శనివారం ఉదయం శవమై తేలాడు. వెంటనే గుర్తించిన ఈతగాళ్లు మృతదేహాన్ని గట్టుకు చేర్చారు. కె.గంగవరం పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే నరేంద్ర మృతితో ద్రాక్షారామ తోటపేటలో విషాదచాయలు అలముకున్నాయి. నరేంద్ర తల్లి ద్రాక్షారామలోని ప్రైవేట్‌గా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment