![అమెరికాలో ఇంటర్న్‌షిప్‌నకు అమలాపురం కుర్రాడు](/styles/webp/s3/article_images/2024/08/18/18amp20-270004_mr-1724004699-0.jpg.webp?itok=6Gg7j-Vo)
అమెరికాలో ఇంటర్న్‌షిప్‌నకు అమలాపురం కుర్రాడు
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు సినీ నటుడు సోనూసూద్ అందించిన సాయంతో చదువుకుని ప్రయోజకుడై అమెరికాలో ఇన్‌టర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. స్థానిక చిరు వ్యాపారి కుమారుడైన అతడు సోనూ అందించిన రూ.10 లక్షల సాయంతో పంజాబ్‌లోని లూధియానాలోని సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేస్తూ ఈ ఘనత సాధించాడు. జే–వన్ వీసాపై ఆ యువకుడిని హాస్పటాలిటీ స్టూడెంట్ – ఎక్ఛేంజ్ విజిటర్‌గా 12 నెలల పాటు అమెరికా వెళ్లనున్నాడు. కరోనా కాలంలో రవాణా స్తంభించినపడు స్థానిక ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియేల్ సాయంతో తన చదువు కోసం లూధియానా వర్సిటీకి వెళ్లినట్టు గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment