
మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
అయినవిల్లి: మండలంలోని విలస గ్రామం వద్ద గురువారం ఓ వ్యక్తి మోటార్ సైకిల్ ఢీకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి అయినవిల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాజోలు నుంచి అయినవిల్లి వైపు మోటార్ సైకిల్‌పై వస్తున్న వడ్డేపల్లి శ్రీనివాసరావు (55)ను ముక్తేశ్వరం నుంచి అమలాపురం వైపు వస్తున్న మరో మోటార్ సైకిలిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందాడు. అంబులైన్స్‌లో మృతదేహాన్ని అమలాపురం ఏరియా అస్పత్రికి తరలించారు. మృతిని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
దేశభక్తి పరుడికి సత్కారం
సామర్లకోట: స్థానిక బ్రాహ్మణ అగ్రహరంలో నివాసం ఉంటున్న 101 సంవత్సరాల దివిటి అప్పారావును స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువత ఘనంగా సత్కరించింది. యువతలో దేశభక్తి కలిగించడమే లక్ష్యంగా ఆయన 10 ఏళ్లు గా జాతీయ జెండాను భుజాన వేసుకొని పెద్దాపురం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నా రు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నిరాకరించడంతో పాటు కాలినడకనే ఎంత దూరం అయినా వెళుతూ ఉంటాడు. 60 ఏళ్ల వయస్సులోనే నడవలేక పోతున్న రోజుల్లో 101 సంవత్సరాల వయస్సులోని కాలినడకనే తిరుగు తూ దేశభక్తి కోసం జాతీయ జెండాను మోస్తున్న అప్పారావును సత్కరించాలని నియోజకవర్గ శోభాయాత్ర నిర్వాహకుడు కర్రి అప్పలరాజు నిర్ణయించారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు గట్టుపై ఉన్న వివేకానంద గ్రంథాలయంలో యువత సత్కరించారు. పెద్దాపురం మాతృత్వ సేవా సంస్థ, ఫేజ్ బుక్ ఫ్రెండ్స్, శోభా యాత్ర నిర్వాహకులు దివిటి అప్పారావును సత్కరించారు.
కుండలేశ్వరుడి దేశభక్తి
కాట్రేనికోన: మండలంలోని కుండలేశ్వరంలో వేంచేసిఉన్న పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక రంగులతో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకుడు కాళ్లకూరి కామేశ్వరశర్మ కుండలేశ్వర స్వామిని జాతీయ పతాకం రంగులున్న పూలతో సుందరంగా అలంకరించారు.

మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి

మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment