
లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కుదుర్చుకున్న పొత్తుపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ తమ ఉనికి కోసమే ఏకమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఈ పార్టీల గురించి బాగా తెలుసునని, తగిన విధంగా ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.(ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు)
‘‘తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం. అంతకన్నా మరేమీ లేదు. వారి పొత్తు మాకే(బీజేపీ) లాభాన్ని చేకూరుస్తుంది. ప్రజలకు తెలుసు అసలు నిజాలేమిటో, అందుకు అనుగుణంగా ఓట్లు వేస్తారు. బీజేపీ 2014లో సాధించిన స్థానాలక కన్నా ఎక్కువ స్థానాలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 73 స్థానాలు లభించాయి. 2019ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి బరిలోకి దిగనున్నాయి. ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో, ఆర్‌ఎల్డీ రెండు స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. కాంగ్రెస్ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీచేయబోమని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment