29 Women Among 53 CBI Officers To Probe Manipur Violence Cases - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు

Published Thu, Aug 17 2023 10:21 AM | Last Updated on Thu, Aug 17 2023 3:11 PM

29 Women Among 53 CBI Officers To Probe Manipur Violence Cases - Sakshi

మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్‌, నిర్మలాదేవి, మోహిత్‌ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్‌వీర్‌ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్‌లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్‌ డైరెక్టర్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌కు తమ నివేదికను నివేదించనున్నారు.

కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు.
చదవండి: మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్‌’.. దిగ్విజయ్‌ హాట్‌ కామెంట్స్‌

ఈ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే  సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 

కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది.  ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ  విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా  మార్చి 3న  మణిపూర్‌ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్​ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement