సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీధర్
మక్తల్ : మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రజల రక్షణే ధ్యేయం..
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment