maktal
-
మఖ్తల్ పార్తీలో చిట్టెం ఎదురీత..
-
కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడుతున్నారు. దయాకర్‌రెడ్డి గురువారం ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతకాలం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నా ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొంతకాలంగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. (క్లిక్: అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా) ఈ క్రమంలో దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. (క్లిక్: అన్ని పార్టీల్లోనూ అదే సీన్ అలక.. అసంతృప్తి) -
మక్తల్ – హైదరాబాద్ రైలు ప్రారంభం
సాక్షి, మక్తల్: మక్తల్ – హైదరాబాద్ నూతన రైల్వే సరీ్వస్‌ను ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చేపట్టిన హైదరాబాద్ నుంచి కృష్ణా వరకు రైలు సౌకర్యం త్వరలో ప్రారంభమవుతుందని, ఇప్పటికే మక్తల్, జక్లేర్ రైల్వే లైన్ పనులు పూర్తి అయ్యాయన్నారు. కృష్ణా వరకు సైతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలన్నారు. స్థానికంగా రైల్వే సరీ్వస్ ప్రారంభమవడం.. అభివృద్ధికి ఊతం లాంటిందని, ప్రయాణికులకు దూర ప్రాంతాలకు ఇక్కట్లు తప్పాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అటు ఖరీఫ్ సీజన్లో చెరువులన్నింటికీ నీటిని వదులుతామని, గ్రామాల్లోని దాదాపు 100 చెరువులకు నింపుతామన్నారు. ప్రతీ గ్రామానికి నీరందించేలా కాల్వల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి సాగునీటి ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. రైల్వే అధికారులు, మార్కెట్ చైర్మన్ రాజేస్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, గాలిరెడ్డి, తిరుపతి, డైరెక్టర్లు రాజమహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు
సాక్షి, నారాయణపేట : జిల్లాలోని మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద సోమవారం కృష్ణానదిలో పుట్టి మునిగిన దుర్ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పుట్టిలో ప్రయాణించిన వారు కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న పుట్టి మునిగింది. గల్లంతైనవారు సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చేతన ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. (వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు) భారీ వర్షాలతో కృష్ణానదిలో రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే ప్రాంతంలో వల్లభాపురం దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు పుట్టిల్లోనే ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తుంటారు. -
కేసీఆర్ ముస్లిం నమ్మక ద్రోహి: డీకే అరుణ
సాక్షి, నారాయణపేట: మక్తల్, నారాయణపేటలో బీజేపీకి గట్టి పట్టు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అందుకే మక్తల్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని సోమవారం బీజేపీ కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం సహజమన్నారు. సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీ గెలిచే స్థానాల్లో ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు.. ఎన్ఆర్సీ, సీఏఏల పేరు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (బీజేపీ నైతికంగా విజయం సాధించింది) సీఎం కేసీఆర్‌కు దేశం గురించి గాని, దేశ భద్రత గురించి అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్ఆర్సీ చట్టం తీసుకుచ్చిన తర్వాత ముస్లింల గురించి మాట్లాడున్నాడంటే కేసీఆర్ ఎంత నమ్మక ద్రోహి అనేది ముస్లింలు గమనించాలి. బైంసా సంఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని అరుణ ప్రశ్నించారు. ప్రజలు తలలు పగలగొట్టుకున్నా, చచ్చినా తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆమె ధ్వజమెత్తారు. అప్పుడు నోరుమెదపని కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎందుకు మాట్లాడారని అరుణ సూటిగా ప్రశ్నించారు. -
తాళికట్టు వేళ.. వరుడికి చెరసాల
బొమ్మలసత్రం: ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతి మెడలో తాళికట్టేందుకు సిద్ధమైన ఓ వంచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన మోహన్‌కృష్ణ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆగస్టు 24న నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకల కింద రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. జాతకాలు కుదరలేదని దాన్ని రద్దు చేసుకున్నట్టు మోహన్‌కృష్ణ సోదరుడు వీరప్రసాద్ పెళ్లికుమార్తె కుటుంబానికి సమాచారమిచ్చాడు. కట్నాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు. నంద్యాల మహానందీశ్వర దేవస్థానంలో ఆదివారం మరో యువతికి తాళికట్టడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసు కున్న పోలీసులు పెళ్లిపీటలపై కూర్చున్న మోహన్‌కృష్ణతోపాటు అతడి సోదరుడు వీరప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న యువతి కుటుంబసభ్యుల వద్ద కూడా రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం కట్నంగా మాట్లాడుకుని.. ఇప్పటికే రూ.12 లక్షల నగదు, 6 తులాల బంగారం తీసుకున్నట్లు ఆ యువతి తల్లిదండ్రులు తెలిపారు. మోహన్‌కృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరప్రసాద్ గతంలో నంద్యాలలోని కెనరా బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశాడు. ఆ సమయం(2008)లో నిరుద్యోగులను మోసం చేశాడు. రూ.400 చెల్లిస్తే నెలకు రూ.30 వేలు సంపాదించే సలహాలిస్తానని నమ్మించి 300మంది నిరుద్యోగులనుంచి రూ.400 చొప్పున వసూలు చేశాడు. దీనిపై చీటింగ్ కేసు నమోదైంది. -
అక్కడ అసలేం జరిగింది?
సాక్షి, రాజేంద్రనగర్ : చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. ఆదివారం హిమాయత్‌సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. సాయంత్రం 5.40 గంటల సమయం ప్రత్యేక వాహనంలో పోలీసులు దిశ తండ్రితో పాటు సోదరిని పోలీస్ అకాడమీకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉదయం మూడు వాహనాల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎన్కౌంటర్ గురించి ఏమీ అడగలేదు : దిశ కుటుంబీకులు దిశ హత్యాచారం ఘటన రోజు వివరాలను మాత్రమే ఎన్హెచ్ఆర్సీ బృందం అడిగి తెలుసుకుందని ఆమె తండ్రి, సోదరి వెల్లడించారు. విచారణ అనంతరం పోలీస్ అకాడమీ నుంచి బయటకు వచ్చిన వారిని మీడియా ప్రశ్నించగా.. కేవలం సంఘటన జరిగిన రోజు తమకు ఎలా తెలిసిందో వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. మాకు న్యాయం చేయండి.. మక్తల్ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్హెచ్ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్ పాషా తండ్రి ఆరిఫ్ హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడిన ట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. అదే చివరి చూపైంది.. ‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం. ఆ తర్వాత టోల్గేట్ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ? తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్హెచ్ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం. ఆ పోలీసులను విచారించినఎన్హెచ్ఆర్సీ బృందం.. మరో రెండ్రోజులు ఎన్హెచ్ఆర్సీ బృంద సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ఘటనపై నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులను ఎన్హెచ్ఆర్సీ బృందం ఆదేశించిన నేపథ్యంలో వారు ఫోరెన్సిక్, రెవెన్యూ రిపోర్టులతో కలిపి ఓ నివేదికను తయారుచేస్తున్నారు. నవంబర్ 27 దిశ కిడ్నాప్, లైంగికదాడి, హత్య, దహనం నుంచి డిసెంబర్ 6న ఎన్కౌంటర్ వరకు జరిగిన అన్ని విషయాలపై పక్కాగా నివేదిక రూపొందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక ఇచ్చే పనిలో తలమునకలయ్యారు. ఆదివారం ఎన్హెచ్ఆర్సీ బృందం ఎన్కౌంటర్లో గాయపడి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. ఇక నేడు లేదా రేపు మిగిలిన పోలీసులనూ విచారిస్తారని సమాచారం. గుంతల పూడ్చివేత.. ఎన్కౌంటర్ మృతుల అంత్యక్రియల కోసం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో తవ్విన గుంతల్లో ఆదివారం టెంకాయలు వేసి పూడ్చేశారు. మృతదేహాలు వచ్చిన తర్వాత వాటిలో ఉన్న మట్టిని తొలగించి అంత్యక్రియలు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఎన్‌కౌంటర్‌తో జక్లేర్, గుడిగండ్లలో ఉలిక్కిపాటు
సాక్షి, నారాయణపేట: వారం రోజుల ముందు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టికుపోయిండ్రు తండ్రో.. మళ్లీ శుక్రవారం తెల్లవారుజామునే పోలీసుల ఎన్కౌంటర్లో చేతిలో సచ్చి శవమైతిరో బిడ్డో.. అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దిశను హత్య చేసిన నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమవడంతో దేశమంతా ప్రజలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా.. నిందితుల స్వగ్రామాలైన మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్‌లో ఒక్కసారిగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిశ్శబ్దం.. విచారంతో కూడిన గంభీరమైన వాతావరణం కనిపించింది. మృతిచెందిన ఆ నలుగురి ఇళ్ల దగ్గర కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురిని పట్టుకొని వెళ్లినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కుటుంబీకులు ఉన్నారు. ఆ నలుగురు చేసిన పాడుపనితో జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చెడ్డపేరు వచ్చిందని, ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం.. ఆడపిల్లలకు భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుండడంతో స్వాగతిస్తున్నామంటూ పలువురు బహిరంగంగానే హర్షం వ్యక్తపరిచారు. ఆ నలుగురు కుటుంబాల తల్లిదండ్రులు తప్ప ఇతరులు అయ్యో పాపం అన్న పాపానపోలేదు. సెల్యూట్.. పోలీస్ నారాయణపేట: పశువైద్యురాలు ‘దిశ’ను అత్యంత అమానవీయంగా హతమార్చిన దుర్మార్గులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మృగాళ్లకు సరైన శిక్షే పడిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిందితుల స్వగ్రామాల్లోనూ ప్రజలు ఈ ఘటనను స్వాగతిస్తుండగా.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఒకింత ఆవేదనకు గురయ్యారు. నిందితులు మహ్మద్‌పాషా అలియాస్ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్‌కుమార్, చింతకుంట చెన్నకేశవులు ఎన్కౌంటర్ అయ్యారని శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తెలియడంతో మక్తల్ మండలంలోని జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో చర్చనీయాంశమైంది. టీవీలు, వాట్సప్‌లో ఈ వార్త రాగానే వారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆ నలుగురి కుటుంబీకులు రోదించసాగారు. మా కొడుకులతో ఒక్కసారైనా మాట్లాడకుండా.. చూడకుండా చంపేశారా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. గ్రామాలకు చేరుకున్న పోలీసులు గుడిగండ్లలో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితి.. నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావుతోపాటు పోలీస్ అధికారులు గుడిగండ్ల, జక్లేర్‌కు హుటాహుటిన చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దామరగిద్ద, మక్తల్, కృష్ణ, మాగనూర్, వనపర్తి, మరికల్, నారాయణపేటల నుంచి ప్రత్యేక వాహనాల్లో పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాల్లో భారీగా సిబ్బంది రావడంతో ఆయా గ్రామాల్లో జనం ఎక్కడికక్కడే చూస్తూ మిన్నంకుండిపోయారు. శవాల వద్దకు కుటుంబీకులు దిశ హత్యలో నిందితులైన జక్లేర్ మహ్మద్‌పాషా అలియాస్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని షాద్‌నగర్‌కు తరలించారు. అలాగే గుడిగండ్లలోని నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యలను సైతం తీసుకెళ్లారు. పీనిగెలు తెచ్చి మా చేన్లో పూడ్చొద్దు మాకు ఉన్నదే రెండు ఎకరాల పొలం. పీనిగెలు మా పొలంలోనే పోతయి. అక్కడ తెచ్చి పూడుస్తామంటే ఊరుకోమంటూ గుడిగండ్ల గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పెద్దలతో మ్యాకల వెంకటమ్మ వాదనకు దిగింది. మేం పంటలు ఎలా పండించుకోవాలి చెప్పండి అంటూ వాపోయింది. ఊరూరికి పీనిగెలు పెట్టేందుకు శ్మశాన వాటిక ఉంది. ఈ ఊర్లో మాత్రం లేదు. మా పొలంలోనే పూడుస్తరు. గుంతలు తవ్వినా పూడ్చివేస్తానంటూ తేల్చిచెప్పింది. దీంతో గ్రామపెద్దలు ఆమెను సముదాయించి అక్కడ పూడ్చరు అని చెప్పడంతో శాంతించి వెళ్లిపోయింది. క్షణం.. క్షణం శివ ఇంటి వద్ద పరిస్థితి: వనపర్తి ఎస్పీ అపూర్వరావు 11.13 గంటలకు వనపర్తి ఎస్పీ అపూర్వరావు పోలీస్ బందోబస్తుతో గుడిగండ్ల గ్రామానికి చేరుకున్నారు. 11.20 గంటలకు నిందితుడు శివ ఇంటికి చేరుకొని వారి తల్లిదండ్రుల గురించా ఆరా. తండ్రి రాజప్ప గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారని తెలుసుకుని ఆయనను తీసుకెళ్లి పోలీస్ వాహనంలో కూర్చోబెట్టాలని పోలీసులకు సూచన. 11.25 గంటలకు గుడిగండ్ల ప్రధాన రహదారిపై చేరుకున్న ఎస్పీ. గ్రామంలో పరిస్థితిపై నిశిత దృష్టి. గ్రామంలోని పెద్దలు ఏమంటున్నారో డీఎస్పీ మధుసూదన్‌రావుతో వివరాల సేకరణ. 11.30 గంటలకు చెన్నకేశవులు తండ్రి కుర్మన్న, గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న రాజప్పను పోలీస్ వాహనంలో ఎక్కించి ముందుగా మరికల్ పోలీస్‌స్టేషన్ తరలింపు. 11.35 గంటలకు నిందితుడు నవీన్ ఇంటికి ఎస్పీ చేరుకొని తల్లి లక్ష్మికి ఓదార్పు. అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌కు తరలింపు. 11.40 గంటలకు గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు పర్యవేక్షించాలని డీఎస్పీ, సీఐలకు ఎస్పీ సూచన. అనంతరం మరికల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీ. మాట్లాడాలని ఉండే.. నేను అయినా ఆడపిల్లనే కదా. తప్పు చేసిన శివతోపాటు ఆ ముగ్గురిని పోలీసులు శిక్షించిన తీరు బాగానే ఉంది. కానీ, మా అమ్మానాన్న మణెమ్మ, రాజప్పలకు ఒక్కసారి మా తమ్ముడు జొల్లు శివతో మాట్లాడాలని ఆశ ఉండే. చూడండి.. గత వారం రోజులుగా తిండి తిప్పలు మాని అనారోగ్యం బారినపడ్డారు. మానసికంగానూ ఎంతగానో కుంగిపోయారు. ఇప్పుడు మా తల్లిదండ్రులను పట్టించుకునేదెవరు. మా తమ్ముడుని కనడమే వీరు చేసిన పాపం అయినట్టుంది. ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. – రాజేంద్రమ్మ, శివ అక్క మంచి నిర్ణయం దిశను దారుణంగా హత్య చేసిన ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మంచి నిర్ణయమే. చెడ్డపని చేస్తే ఇలాంటి చర్యలు ఉంటాయని యువతకు బాగా తెలిసివచ్చింది. – జక్కప్ప, గుడిగండ్ల, మక్తల్ మండలం ఇది గుణపాఠం.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు చేస్తే చట్టరీత్యా కఠిన శిక్షలు పడుతాయనే దానికి ఇదే నిదర్శనం. దిశను కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన స్థలంలోనే ఆ నలుగురిని తీసుకెళ్లి విచారిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం సబబే. చెడు ఆలోచనలు చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలి. – వెంకటయ్యగౌడ్, జక్లేర్, మక్తల్ చెడ్డపేరు తెచ్చారు.. దిశపై అత్యాచారం చేసి హత మార్చిన మహ్మద్‌పాషా, నవీన్, శివ, చెన్నకేశవులు చేసిన పనికి జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు చె డ్డపేరు వచ్చింది. తప్పించుకుపోయేందుకు ప్రయత్నించిన ఆ నలుగురిని పోలీసులు కాల్చిచంపడం స రైందే. ఇకపై యువత ఇలాంటి పనులకు దూరంగా ఉండేందుకు ఈ ఎన్కౌంటర్ గుణపాఠమైంది. – నర్సింహులు, సర్పంచ్, జక్లేర్, మక్తల్ మాకు ధైర్యం వచ్చింది నాకు ఇద్దరు ఆడపిల్లలు. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారం, హత్య చేస్తే వారిని అంతే దారుణంగా పోలీసులు కాల్చి చంపుతారనే ఆ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ద్వారా ధైర్యం వచ్చింది. ఇప్పుడైనా ఆడపిల్లలపై ఇలాంటి పాడుపనులకు పాల్పడవద్దని కోరుకుంటున్నా. – లక్ష్మి, జక్లేర్, మక్తల్ -
ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత
సాక్షి, మక్తల్: పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యాచార నిందితుడు చితంకుంట చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులతో కలిసి అతడి భార్య రేణుక, తల్లి జయమ్మ రోడ్డుపై బైటాయించారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెన్నకేశవులు కుటుంబ సభ్యులు అంటున్నారు. చావనైనా చస్తాం కానీ సామూహిక ఖననానికి ఒప్పుకోమని చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ స్పష్టం చేశారు. తన భర్త మృతదేహాన్ని అప్పగించకపోతే అతడితో పాటు తనను పాతిపెట్టాలని రేణుక అన్నారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని, కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించరా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాన్ని అప్పగించడం కుదరదని వారికి పోలీసులు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎంత ఆలస్యమైనా ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గుడిగండ్లతో పాటు జక్లేర్ గ్రామంలోనూ పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. సంబంధిత వార్తలు.. నన్ను కూడా కాల్చి చంపండి దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ నలుగురు మృగాళ్ల కథ ముగిసింది.. ఇంతటితో ‘రేప్’లు తగ్గిపోతాయా!? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు -
‘ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే’
సాక్షి, నారాయణపేట: ‘ఇలాంటి కొడుకులను కన్నామా.. లోకమంతా అమ్మాయిని పాడు చేసి కాల్చారని చెబుతుంటే వినేందుకు గుండె జల్లుమంటుంది.. ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే..’ అంటూ జస్టిస్ ఫర్ దిశను దారుణంగా హత్య చేసిన వారికి ఏ శిక్ష పడినా బాధపడబోమని మహ్మద్‌పాషా, శివ, నవీన్‌కుమార్, చెన్నకేశవుల తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. మరో నిందితుడు అంటూ హల్చల్.. ‘జస్టిస్ ఫర్ దిశ’ హత్య కేసులో మరో నిందితుడు ఉన్నాడంటూ శనివారం సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నరంటూ వదంతులు వచ్చాయి. దానిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఆ మండల పోలీస్ బాస్ చిన్నపొర్లకు వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ తెలింది. అయితే గుడిగండ్ల నవీన్‌కుమార్ చిన్నపొర్లలో వారి బంధువుల ఇంటా ఉండి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తల్లి లక్ష్మిని ప్రశ్నించగా చిన్నపుడు చిన్నపొర్లలలో చదువుకున్నాడంటూ తెలిపింది. దేశమంతటా గుడిగండ్ల, జక్లేర్ మాటే.. జస్టిస్ ఫర్ దిశని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్‌గ్రామాలకు చెందిన మహ్మద్‌పాషా, నవీన్‌కుమార్, చెన్నకేశవులు, శివలనే నిర్ధారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జాతీయ మీడియా సైతం జస్టిస్ ఫర్ దిశ హత్యకు సంబంధించిన వార్త కథనాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో మారుమూల గ్రామాలైన గుడిగండ్ల, జక్లేర్ల పేర్లు దేశమందరి నోటా వినిపించినట్లయింది. రాయిచూర్ టూ హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం హత్యచేసింది ఇదే గుడిగండ్ల, జక్లేర్ గ్రామ యువకులంటూ చెప్పుకున్నారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు వెంటనే ట్విట్ చేశారు. దీంతో జాతీయ నేతలు సైతం స్పందించడంతో ప్రతి ఒక్కరి నోటా ఇదే మాటా వినిపిస్తుంది. నేను బతికున్నా.. సచ్చినట్లు అనిపిస్తోంది ఎప్పుడైతే పదో తరగతి ఫెయిల్ అయ్యాడో అప్పటి నుంచి నా కొడుకు గాడిదికిందపడేనప్పా.. అంటూ మహ్మద్‌పాషా అలీయాస్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్ భార్య మౌలానీబీతో కలసి కన్నీరుపెట్టారు. ఏదో పెట్రోల్ బంకులో పనిచేస్తానంటే సరే అంటిమి.. లారీ డ్రైవర్లతో కూనమై హైదరాబాద్పాయే.. వాడు ఇంత లంగపనులు చేస్తాడని ఏ తండ్రి అనుకుంటాడో చెప్పండి. దునియాల చాలా మంది లారీ డ్రైవర్లుగా పనిచేస్తుండ్రు... కానీ ఇలా చేశారని నేను ఎక్కడ వినలేదబ్బా. నాకు ఒక బిడ్డా ఉంది. ఆ ఆడపిల్లను కాల్చిచంపిండు అని వినగానే నేను బతికున్నా సచ్చినట్లు అనిపిస్తోందబ్బా. నీ కొడుకు కేసు మీదా సంతకం చేయమని చెప్పి షాద్‌నగర్ పోలీసులు చెబితే శనివారం వెళ్లా. వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టా. బయట ఎక్కడ చెప్పొద్దు తండ్రివని చంపుతారని పోలీసులు చెప్పారు. నన్ను టోల్‌ప్లాజా దగ్గర వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఊరికి వచ్చా. – మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్ ఆవేదన నా కొడుకని చెప్పుకొనేందుకు పానం ఒప్పడం లేదు నా కొడుకు శివ అని చెప్పుకునేందుకు పానం ఒప్పడం లేదు. వాడు చేసిన పనికి ఉరితీసిన పోను.. కోర్టుకు పిలిచిన వెళ్లను అంటూ తండ్రి గొర్రెల కాపరి రాజప్ప గొల్లుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిని నీ కొడుకు శివ మరో ముగ్గురితో కలిసి కాల్చిచంపిన కేసులో జైలుకు పంపుతున్నమంటూ షాద్‌నగర్ నుంచి పోలీసులు రమ్మని చెబితే శనివారం అక్కడికి వెళ్లాను. పోలీసులు కేసు నమోదుచేసిన కాగితాలపై సంతకం చేయాలని చెప్పారు. ఏడుస్తూ నా కొడుకును ఉరితీసినా రాను అంటూ సంతకం పెట్టి వచ్చానని తెలిపాడు. – శివ తండ్రి రాజప్ప పరువు తీసిండ్రు జస్టిస్ ఫర్ దిశను అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ దారుణానికి పాల్పడింది మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల వారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయిని హత్యచేసి మక్తల్ పరువు తీశారు. వారికి తగిన శిక్ష పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. – చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మక్తల్, ఎమ్మెల్యే -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, మక్తల్(మహబూబ్‌నగర్): లంచం తీసుకుంటూ మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దిన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరగా.. రూ.75వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు సదరు రైతు ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. చివరికి ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులను తీసుకోగా.. సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను, మధ్యవర్తిని గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న విషయం తెలియడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయమై.. హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి మక్తల్ మండలం సంగంబండకి చెం దిన రైతుల దగ్గర సర్వే నంబర్ 200లో 18 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ భూమిని తాను, తన సోదరుడి పేర్లపై రిజిస్ట్రేష న్ చేసుకునేందుకు రెండు సార్లు కార్యాలయాని కి వెళ్లి విన్నవించాడు. ఎంతకూ సదరు సబ్రి జిస్ట్రార్ హబీబొద్దీన్ లెక్కచేయలేదు. అసలు వి షయం కనుక్కునేందుకు కొందరిని సంప్రదిం చాడు. దీంతో ఓ మధ్యవర్తి లంచం డిమాండ్ చేశాడు. ఎన్నో భేరసారాల తర్వాత చివరికి రూ.75వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నాడని తెలిపారు. దీంతో చేసేది లేక మొదట పని పూర్తి చేయాలని, తర్వాత డబ్బు ఇస్తానని రైతు పేర్కొన్నాడు. గతంలో ఇద్దరు అధికారులు గత 15ఏళ్ల క్రితం మక్తల్‌కు చెందిన రైతు భూమి రిజిస్టేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఇదే కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులకు పట్టించారు. అలాగే, మూడేళ్ల క్రితం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓను ఏసీబీ చేతికి పట్టించారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దీన్ను పట్టుకోవడంతో ఏసీబీ దాడులు నిర్వహించడం పట్టణంలో మూడోసారి అవుతుంది. వల పన్ని పట్టుకున్నారిలా.. ఈమేరకు 18ఎకరాల భూమిని రైతు వెంకట్‌రెడ్డి, అతని సోదరుడి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారి హబీబోద్దీన్తో ఈ నెల 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఈ నెల 14వ తేదీన భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. పని పూర్తయ్యిందని, ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాల్సిందిగా రైతును కోరారు. వెంటనే రైతు జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులకు 1064 నంబర్‌కు ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన వారిని ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. గురువారం మక్తల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తమ భూమికి సంబందించిన పత్రాలను తీసుకునేందుకు రైతు వచ్చాడు. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్ హబీబొద్దిన్ దగ్గర ఉండే మక్తల్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి అరీస్కు రైతు వెంకట్‌రెడ్డి రూ.75వేలు అందజేశాడు. అనంతరం డబ్బులను అరిస్ సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే రైతు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు ప్రవీణ్‌కుమార్, లింగంస్వామి సబ్‌రిజిస్ట్రార్‌ను తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి చేతులు కడిగించి ఎరుపు రంగు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దిన్, అతనికి సహకరించిన అరిస్.. ఇద్దరిని పట్టుకున్నారు. సాయంత్రం 6.30 వరకు కార్యాలయంలోనే విచారణ జరిపి అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రతాప్ విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొ దర్యాప్తు జరుపుతామని తెలిపారు. కార్యాలయంలో.. అంతా ఇష్టారాజ్యం మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అసలు సమయ పాలనే లేదు. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్టేషన్ చేయాలి. చాలామటుకు లావాదేవీలన్నీ ఫోన్లు, మరికొందరు దళారులు, కార్యాలయం వద్ద ఉన్న కొందరు డాక్యుమెంట్ షాపులకు చెందిన వారి ద్వారానే జరిగేవని పేర్కొంటున్నారు. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా డబ్బులు ఇస్తేనే పనులు చేయండని.. గతంలో అధికారులు ఇలాగే ఉండేవారని, మీరు కూడా అదే బాటలో నడవాలని కొందరు దళారులు మాయమాటలు చెప్పి నడిపించేవారని కింది స్థాయి అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తేనే పని అవుతుందని, చేయి తడపకపోతే వారికి కంప్యూటర్ పని చేయడంలేదు, సర్వర్ పనిచేయడంలేదంటూ ముప్పతిప్పలు పెట్టేవారని ప్రజలు వివరిస్తున్నారు. -
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి, మక్తల్: ఒకప్పుడు వీధుల్లో వర్షం వస్తే చాలు గుంతలుమయంగా, రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి పందు లు సంచరిస్తూండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారుమారై అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది మక్తల్ పట్టణం. నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డి ప్రతేక్యంగా చొరవ తీసుకొని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారు. గతేడాది ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అధికారుల పర్యవేక్షణలో గడుపులోపే పనులు చేయాలని ఆదేశాలు ఉండటంతో త్వరతిగతిన పనులు చేయించా రు. పట్టణంలో 5 ఎంపీటీసీ పరిధిలోని 18 వార్డు లో పనులు పూర్తిచేశారు. అదేవిధంగా మిగతా కాలనీల్లో సైతం నిధులు మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధిలో కుంటుపడిన ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిల్లో మక్తల్‌కు ప్రా ధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇవే కాకుండ మం డంలోని గ్రామాలకు రూ.3కోట్ల నిధులు మంజూ రు చేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగాయి. -
దాహం..దాహం!
సాక్షి, మక్తల్: వేసవికాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్లు కరువయ్యాయి. ప్రతి రోజు పాఠశాలల్లో విద్యార్థులు మంచినీళ్లు లభించక దాహార్తితో అలమటిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంటలు చేయడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాలల్లో మంచినీటి ఎద్దడి నెలకొన్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. మక్తల్ మండలంలో మొత్తం 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 36 పీఎస్‌లు, 14 యూపీఎస్‌లు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో మొత్తం దాదాపు 27 పాఠశాలల్లో మంచినీటి సమస్య ఏర్పడి విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కనీసం పాఠశాల విద్యార్థులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితి దాపురించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు అక్కడ తాగడానికి కూడా మంచినీళ్లు లేకపోవడం మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేసిన విద్యార్థులకు కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు కరువైపోయాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులు ప్రతి రోజు ఆయా పాఠశాలల్లో మంచినీళ్ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణనాతీతం. కొందరు విద్యార్థులు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకొని తోటి విద్యార్థులతో కలిసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని పంచదేవ్‌పహాడ్, పస్పుల, జక్లేర్, బొందల్‌కుంట, మక్తల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కర్ని, రామసముద్రం, జౌలపురం, ఉపర్పల్లి, సోమేశ్వర్‌బండ తదితర పాఠశాలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా పాఠశాలల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
ఉలిక్కిపడిన మక్తల్
మక్తల్ : మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజల రక్షణే ధ్యేయం.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
పండుగ వేళ.. మృత్యు హేల
► లారీని ఢీకొట్టిన ఆటో.. ఆరుగురు దుర్మరణం ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ సమీపంలో ఘటన మక్తల్: ఎదురుగా వస్తున్న ఓ లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మక్తల్ మండలం మాదన్ పల్లికి చెందిన చిన్నకురుమయ్య ఆటో నడుపు తూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం సంత కావడంతో ఆటోలో 18 మంది ప్రయాణి కులను ఎక్కించుకొని మక్తల్ నుంచి తిరిగి వస్తుండగా.. కాచ్వార్ సమీపంలో ఓ గొర్రెను తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొ ట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ చిన్న కురుమయ్య (30)తోపాటు మాదన్‌పల్లికి చెందిన రాములు (65), హన్మంతు(50), జక్లేర్‌కు చెందిన వెంకటయ్య(50) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జయమ్మ, చంద్రమ్మ మహబూ బ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన దత్తుశ్రీలు మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందు తోంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడంతోపాటు నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. -
ఘనంగా బాలగంగాధర్ తిలక్ జయంతి
మక్తల్ : బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలను పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి భీంరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రమే నా జన్మహక్కు అని ప్రతి భారతీయుడి మనసులో నిలిచిన మహనీయుడని అన్నారు. చిన్నతనం నుంచి దేశభక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడని అన్నారు. ఆయన ఆశయసాధన కోసం మనవంత కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బాలాజీ, కార్యదర్శి సత్యనారాయణగౌడ్ పలువురు నాయకులు వాకిటి రమేష్, భాస్కర్‌రెడ్డి, నరసింహ, మహేష్‌సాగర్, అనిత, అజయ్, రాకేష్, రేణుకనర్సింహ, నాగప్ప, అనంపల్లి కొండయ్య, వన్నెకారిరాజు, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.