ఎన్‌కౌంటర్‌: గుడిగండ్లలో ఉద్రిక్తత | Hyderabad Encounter: Chennakesavulu Wife Protest | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌: చెన్నకేశవుల కుటుంబీకుల ఆందోళన

Published Fri, Dec 6 2019 6:38 PM | Last Updated on Fri, Dec 6 2019 6:46 PM

Hyderabad Encounter: Chennakesavulu Wife Protest - Sakshi

సాక్షి, మక్తల్‌: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యాచార నిందితుడు చితంకుంట చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులతో కలిసి అతడి భార్య రేణుక, తల్లి జయమ్మ రోడ్డుపై బైటాయించారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెన్నకేశవులు కుటుంబ సభ్యులు అంటున్నారు. చావనైనా చస్తాం కానీ సామూహిక ఖననానికి ఒప్పుకోమని చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ స్పష్టం చేశారు.

తన భర్త మృతదేహాన్ని అప్పగించకపోతే అతడితో పాటు తనను పాతిపెట్టాలని రేణుక అన్నారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని, కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించరా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాన్ని అప్పగించడం కుదరదని వారికి పోలీసులు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎంత ఆలస్యమైనా ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గుడిగండ్లతో పాటు జక్లేర్‌ గ్రామంలోనూ పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు.

సంబంధిత వార్తలు..

నన్ను కూడా కాల్చి చంపండి

దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్‌

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..

ఇంతటితో ‘రేప్‌’లు తగ్గిపోతాయా!?

‘సాహో సజ్జనార్‌’ అంటూ ప్రశంసలు..

దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement