Chenna kesavulu
-
ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత
సాక్షి, మక్తల్: పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యాచార నిందితుడు చితంకుంట చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని బంధువులతో కలిసి అతడి భార్య రేణుక, తల్లి జయమ్మ రోడ్డుపై బైటాయించారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెన్నకేశవులు కుటుంబ సభ్యులు అంటున్నారు. చావనైనా చస్తాం కానీ సామూహిక ఖననానికి ఒప్పుకోమని చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ స్పష్టం చేశారు. తన భర్త మృతదేహాన్ని అప్పగించకపోతే అతడితో పాటు తనను పాతిపెట్టాలని రేణుక అన్నారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని, కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించరా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మృతదేహాన్ని అప్పగించడం కుదరదని వారికి పోలీసులు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎంత ఆలస్యమైనా ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గుడిగండ్లతో పాటు జక్లేర్ గ్రామంలోనూ పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. సంబంధిత వార్తలు.. నన్ను కూడా కాల్చి చంపండి దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ నలుగురు మృగాళ్ల కథ ముగిసింది.. ఇంతటితో ‘రేప్’లు తగ్గిపోతాయా!? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు -
శీలానికి వెలకట్టిన పెద్దలు..
కల్లూరు రూరల్: మోసగాడి మాయమాటల్లో పడి ఓ అమాయకురాలు గర్భవతైంది. పెద్దలు ఆమె శీలానికి వెలకట్టి వదిలేశారు. నిందితుడి తల్లి దగ్గరుండి మరీ అబార్షన్ చేయించింది. అనారోగ్యంతో రెండు నెలల తర్వాత శుక్రవారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, 12 మందిపై కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజరకు చెందిన వికలాంగురాలు వాంకుడోత్ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్నకేశవులు మాయమాటలు చెప్పి లోబర్చకున్నాడు. గర్భం దాల్చడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో బాధితురాలిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40 వేలు చెల్లించేలా ఇరు కుటుంబాల మధ్య గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో చెన్నకేశవులు తల్లి లచ్చి.. బాధితురాలికి ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శనివారం 12 మందిపై కల్లూరు ఏసీపీ బల్లా రాజేశ్ కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన ఆస్పత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
యువకుడిపై మూకుమ్మడి దాడి
పుట్టపర్తి అర్బన్ : పుట్తపర్తి మండలం బొంతలపల్లికి చెందిన చెన్నకేశవులు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన నాగేశ్, అతని సోదరులు కేశవ, రామచంద్ర గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి శుక్రవారం తెలిపారు. తన భార్యతో చెన్నకేశవులు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో నాగేశ్ తన సోదరులతో కలసి దాడి చేసినట్లు వివరించారు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సక్షమంలో పంచాయితీ సైతం జరిగిందన్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుడి చెయ్యి, కుడి కాలు విరిగేలా రాళ్లతో కొట్టారన్నారు.దెబ్బలకు అతను స్పహతప్పి పడిపోగా, వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి తరలించినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుకున్నది సాధించాడు!
గండేడ్: మారుమూల పల్లెలో జన్మించాడు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నాడు.. ఇంటర్, ఇంజినీరింగ్ నగరంలోని ఎస్వీఎంఆర్ కళాశాలలో చదువుకున్న అతను సివిల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు.. ఈ క్రమంలో వచ్చిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నాడు.. చివరకు లక్ష్యం చేరుకున్నాడు.. రెండు రోజుల క్రితం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 885వ ర్యాంకు సాధించాడు. ఆయనే గండేడ్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్. గ్రామానికి చెందిన సుతారి చెన్నకేశవులు, లింగమ్మల కుమారుడు అనిల్. తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కాచెల్లెల్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సివిల్స్‌నే టార్గెట్ చేసుకున్న అనిల్ ఏడు సార్లు ఐఏఎస్ పరీక్ష రాసి చివరిసారిగా ర్యాంకు సాధించాడు. నగరంలో ఏడాదిపాటు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే ప్రిపేర్ అయ్యానని చెప్పాడు అనిల్. స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇప్పుడు సాధించిన ర్యాంకుకు రైల్వే శాఖలో ఉద్యోగం రావొచ్చని, ఏ కేటగిరీలోనైనా ఐఏఎస్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోమారు అవకాశం ఉంటే మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. మా కల నెరవేరింది మాకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. ఇన్నాళ్లు కుమారుడి గురించి బెంగ ఉండేది. ఇప్పుడది తీరింది. ఐఏఎస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. -చెన్నకేశవులు, అనిల్ తండ్రి