మక్తల్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
సాక్షి, మక్తల్: ఒకప్పుడు వీధుల్లో వర్షం వస్తే చాలు గుంతలుమయంగా, రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి పందు లు సంచరిస్తూండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారుమారై అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది మక్తల్ పట్టణం. నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్‌రెడ్డి ప్రతేక్యంగా చొరవ తీసుకొని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారు.
గతేడాది ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అధికారుల పర్యవేక్షణలో గడుపులోపే పనులు చేయాలని ఆదేశాలు ఉండటంతో త్వరతిగతిన పనులు చేయించా రు. పట్టణంలో 5 ఎంపీటీసీ పరిధిలోని 18 వార్డు లో పనులు పూర్తిచేశారు. అదేవిధంగా మిగతా కాలనీల్లో సైతం నిధులు మంజూరు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధిలో కుంటుపడిన ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిల్లో మక్తల్‌కు ప్రా ధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇవే కాకుండ మం డంలోని గ్రామాలకు రూ.3కోట్ల నిధులు మంజూ రు చేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment