మక్తల్‌ – హైదరాబాద్‌ రైలు ప్రారంభం | Train Service Between Maktal and Hyderabad Has been Started | Sakshi
Sakshi News home page

రైలును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి

Published Mon, Aug 24 2020 11:39 AM | Last Updated on Mon, Aug 24 2020 11:39 AM

Train Service Between Maktal and Hyderabad Has been Started - Sakshi

సాక్షి, మక్తల్‌: మక్తల్‌ – హైదరాబాద్‌ నూతన రైల్వే సరీ్వస్‌ను ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చేపట్టిన హైదరాబాద్‌ నుంచి కృష్ణా వరకు రైలు సౌకర్యం త్వరలో ప్రారంభమవుతుందని, ఇప్పటికే మక్తల్, జక్లేర్‌ రైల్వే లైన్‌ పనులు పూర్తి అయ్యాయన్నారు. కృష్ణా వరకు సైతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలన్నారు. స్థానికంగా రైల్వే సరీ్వస్‌ ప్రారంభమవడం.. అభివృద్ధికి ఊతం లాంటిందని, ప్రయాణికులకు దూర ప్రాంతాలకు ఇక్కట్లు తప్పాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అటు ఖరీఫ్‌ సీజన్‌లో చెరువులన్నింటికీ నీటిని వదులుతామని, గ్రామాల్లోని  దాదాపు 100 చెరువులకు నింపుతామన్నారు. ప్రతీ గ్రామానికి నీరందించేలా కాల్వల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి సాగునీటి ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు.  రైల్వే అధికారులు, మార్కెట్‌ చైర్మన్‌ రాజేస్‌గౌడ్,  మహిపాల్‌రెడ్డి, గాలిరెడ్డి, తిరుపతి, డైరెక్టర్లు రాజమహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement