సాక్షి,ఖలీల్‌వాడి(హైదరాబాద్): నవీపేట్ శివారులో సాయినగర్ షిర్డీలో రైలులో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ సంఘటనలో నిందితులను రైల్వే పోలీసులు వదిలేసినట్లుగా సమాచారం. నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు నవీపేట వద్ద క్రాసింగ్ ఉందని ఆపగా అక్కడ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు ఎక్కి ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన విషయం విదితమే.. రైలులో బ్యాగ్‌లు చోరీ జరిగినట్లు తెలుసుకున్న ప్రయాణికులు బాసర వద్ద రైలును చైన్ లాగి ఆపిన విషయం తెలిసిందే.
అయితే రైలు ఆగగానే పారిపోతున్న యువతుల్లో కొందరిని రైలు ప్రయాణికులే పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. బాధితులు సైతం తమ పూర్తి వివరాలతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగుల్లో ల్యాప్‌టాప్‌తో డబ్బులు, ల్యాప్‌టాప్, ఓ మహిళ మెడలో నుంచి చైన్ ఎత్తుకెళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు గుంటరు, విజయవాడ, నెల్లరు, వైజాగ్, కడపకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
మర్మమేమిటో..!
బాసర రైల్వే పోలీసులు, ఆర్‌ఫీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిది మంది యువతులను విచారించి వదిలి వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యువతులు మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందినట్లు వారుగా గుర్తించారు. సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదనే విమర్శులున్నాయి. ప్రయాణికులు బాసర వద్ద చైన్ లాగిన తర్వాత అక్కడి సీసీ ఫుటేజీలు, అలాగే యువతులు నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద ఎక్కిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే చోరీ విషయమై స్పష్టత వస్తుందనిప్రయాణికులు పేర్కొంటున్నారు.
బాసర వద్ద ఉన్న సీసీపుటేజీల్లో యువతులు బ్యాగులు తీసుకుని స్లీపర్ కోచ్ నుంచి జనరల్ బోగీల్లోకి వెళ్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ పక్కన పడ్డ బ్యాగులు రైల్వే పోలీసుల వద్ద ఉన్నట్లు తెలిసింది. ఈ బ్యాగులు రైల్వేట్రాక్ పక్కకు ఎలా వచ్చాయనే విషయపై రైల్వేపోలీసులు సరైన విచారణ చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రైలులో చోరీపై ఎస్పీ, ఎస్బీ ఆరా..!
సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీపై రైల్వే ఎస్పీ, రైల్వే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రైల్వే అధికారుల నుంచి వివరాలను సేకరింనట్లు సమాచారం. ఈ చోరీలో ప్రయాణికులు పట్టింన నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చోరీకి పాల్పడ్డ యువతులను ఆర్‌పీఎఫ్ పోలీసులు రైలు లో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉద యం తీసుకొచ్చినట్లు తెలిసింది. వారిని రైల్వే పోలీ సులకు అప్పజెప్పినట్లు సమాచారం.
చదవండి: Dundigal 83 Police SI's Transfers: ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment