Viral: Train Coach Turned Into Restaurant at Kacheguda Railway Station - Sakshi
Sakshi News home page

కాచిగూడలో రెస్టారెంట్‌గా మారిన రైల్వే కోచ్‌.. తెలంగాణలోనే తొలిసారి

Published Tue, Jul 25 2023 7:09 PM | Last Updated on Tue, Jul 25 2023 7:36 PM

Viral: Train Coach Turned Into Restaurant at Kacheguda Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:/కాచిగూడ: ట్రైన్‌లో కూర్చొని భోజనం చేస్తున్న అనుభూ­తిని నగరవాసులు ఇకనుంచి ఫీల్‌ కావొచ్చు. ప్రస్తుతం సిటీలో అందుబాటులో ఉన్న  జైల్‌మండి, రైల్‌ మండి తరహాలో కాచిగూడ రైల్వేస్టేషన్‌లో పరివార్‌ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరిట ట్రైన్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలూ ఈ రెస్టారెంట్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌లతో ఈ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయగా, ఇందులో సుమారు 120మంది వరకూ కూర్చోవచ్చు.

కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ ‘థీమ్‌ హోటల్‌’తో రైల్వేస్టేషన్‌కు మరింత అందం సంతరించింది. తెలంగాణలోనే ఇది మొట్టమొదటిసారి రైల్వే కోచ్‌లలో ఏర్పాటు చేసిన హోటల్‌ కావడం విశేషం. ఐదు సంవత్సరాల కాలపరిమితి కోసం సికింద్రాబాద్‌కు చెందిన మెస్సరస్‌ పరివార్స్‌ హావ్‌ మోర్‌కు ఈ రెస్టారెంట్‌ కోచ్‌లను లీజ్‌కు ఇచ్చారు.  

బంగారు వర్ణంతో కోచ్‌ల అలంకరణ 
నిజాంకాలంనాటి ఈ హెరిటేజ్‌ కోచ్‌లను బంగారు వర్ణంతో అందంగా అలంకరించారు.హెదరాబాద్‌ బిర్యానీ­తోపాటు, ఉత్తర, దక్షిణా­ది, చైనీస్, మొఘలాయ్‌లాంటి బహుళ వంటకాల ఎంపికలతో కూడిన ఈ రెస్టారెంట్‌ భోజనప్రియులను ఎంతో ఆకట్టుకుంటుందని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ డివిజన్‌ అధికారుల కృషిని అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement