kachiguda railway station
-
కాచిగూడలో రెస్టారెంట్‌గా మారిన రైల్వే కోచ్.. తెలంగాణలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్:/కాచిగూడ: ట్రైన్లో కూర్చొని భోజనం చేస్తున్న అనుభూతిని నగరవాసులు ఇకనుంచి ఫీల్ కావొచ్చు. ప్రస్తుతం సిటీలో అందుబాటులో ఉన్న జైల్‌మండి, రైల్ మండి తరహాలో కాచిగూడ రైల్వేస్టేషన్లో పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ పేరిట ట్రైన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలూ ఈ రెస్టారెంట్లో సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌లతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయగా, ఇందులో సుమారు 120మంది వరకూ కూర్చోవచ్చు. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ‘థీమ్ హోటల్’తో రైల్వేస్టేషన్‌కు మరింత అందం సంతరించింది. తెలంగాణలోనే ఇది మొట్టమొదటిసారి రైల్వే కోచ్‌లలో ఏర్పాటు చేసిన హోటల్ కావడం విశేషం. ఐదు సంవత్సరాల కాలపరిమితి కోసం సికింద్రాబాద్‌కు చెందిన మెస్సరస్ పరివార్స్ హావ్ మోర్‌కు ఈ రెస్టారెంట్ కోచ్‌లను లీజ్‌కు ఇచ్చారు. బంగారు వర్ణంతో కోచ్‌ల అలంకరణ నిజాంకాలంనాటి ఈ హెరిటేజ్ కోచ్‌లను బంగారు వర్ణంతో అందంగా అలంకరించారు.హెదరాబాద్ బిర్యానీతోపాటు, ఉత్తర, దక్షిణాది, చైనీస్, మొఘలాయ్లాంటి బహుళ వంటకాల ఎంపికలతో కూడిన ఈ రెస్టారెంట్ భోజనప్రియులను ఎంతో ఆకట్టుకుంటుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ డివిజన్ అధికారుల కృషిని అభినందించారు. The @SCRailwayIndia started #RestaurantOnWheels, a train themed #restaurant at Kacheguda Rly Stn in #Hyderabad to offer a novel experience to food connoisseurs, providing them with a unique dining ambience 24 hrs. 2 heritage coaches have been refurbished with aesthetic interiors. pic.twitter.com/5nMCJ67j8d — Surya Reddy (@jsuryareddy) July 25, 2023 Quick Glimpses on Restaurant on Wheels' at #Kacheguda Railway Station#RestaurantOnWheels @drmhyb @RailMinIndia @AshwiniVaishnaw @drmsecunderabad @PIBHyderabad pic.twitter.com/3jwdowo8bk — South Central Railway (@SCRailwayIndia) July 25, 2023 -
దసరా ఎఫెక్ట్: ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు పెంపు.. స్పెషల్ ట్రైన్స్ ఇవే..
దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేష్లన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు నేటి(సెప్టెంబర్ 25) నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 9 తర్వాత మళ్లీ టికెట్ ధర రూ. 10కి చేరుతుంది. ఇదిలా ఉండగా.. దసర పండుగ సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్టు వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season. The hike in platform ticket price is applicable up to 09th October, 2022. *Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3 — South Central Railway (@SCRailwayIndia) September 26, 2022 ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే.. - సెప్టెంబర్ 28న.. సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్. - సెప్టెంబర్ 29న.. యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 9న.. తిరుపతి నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 10న.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది. Kindly note: SCR to run #Train No. 07265/66 Secunderabad- Yesvantpur-Secunderabad Special train Ex. Secunderabad on 28.09.22 and Ex. Yesvantpur on 29.09.22 under TOD(trains on demand) to clear extra rush.#SWRupdates .@DDChandanaNews pic.twitter.com/QUJY6oADaN — South Western Railway (@SWRRLY) September 26, 2022 -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్‌ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్‌కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
ప్రమాదం ఎలా జరిగింది..?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్లో సమావేశమైంది. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, తదనంతర పరి ణామాలపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే భద్రత కమిషనర్ రాంకృపాల్ నేతృత్వంలో జరి గిన ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సీతారాం, వివిధ విభాగాలకు చెంది న ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారు లు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో ఎంఎంటీఎస్ ట్రైన్ కనీసం 50 కిలోమీటర్లపైనే వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. వేగం వల్లే ఎక్కువ బోగీలు ధ్వంసమైనట్లు తేల్చా రు. ప్రమాద సమయంలో లూప్లైన్లో నెమ్మదిగా క్రాస్ చేస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వాకిం గ్ స్పీడ్‌తో ముందుకెళ్లడం వల్ల కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విధి నిర్వహణలో ఉన్న కాచిగూడ స్టేషన్ మేనేజర్ దశరథ్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, సిగ్నలింగ్ స్టాఫ్‌ను విచారించారు. ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచీ వివరాలు సేకరించారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ బాలకిషన్‌తోనూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ సమావేశమైంది. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మానసిక స్థితిని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టారు. అతడితో పనిచేస్తున్న సహోద్యోగులు, పైఅధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేవలం ఏమరుపాటుగానే సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లి ఉంటే ఆ ఏమరుపాటుకు దారితీసిన అంశాలేంటీ అనే దానిపైనా దృష్టి సారించారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్న దృష్ట్యా లోకో పైలట్‌కు సన్నిహితులైన వ్యక్తుల నుంచి అదనపు సమాచారం సేకరించాలని భావిస్తున్నారు. విషమంగానే లోకోపైలట్ పరిస్థితి లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి డాక్టర్లు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప అతడి ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
కాచిగూడ రైలుప్రమాదంపై హైలెవల్ కమిటీ..
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం (13న) ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలెట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసుల అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ రైలును లోకోపైలట్ మూవ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సిగ్నల్‌ను విస్మరించడమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక, రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్ 337, ర్యాష్‌డ్రైవింగ్ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్ 338 కింద చంద్రశేఖర్‌పై కేసులను నమోదు చేశారు. మరోవైపు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
మొట్టమొదటి దుర్ఘటన
సాక్షి, సిటీబ్యూరో:కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, లోకోపైలెట్ చంద్రశేఖర్ గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిటీ లైఫ్‌లైన్ ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రతిరోజు సుమారు లక్షన్నర మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రజా రవాణాలో ఇది సిటీ లైఫ్‌లైన్‌గా నిలిచింది. తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 15–30 నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసు చొప్పున నడుస్తోంది. పాలు, కూరగాయలు విక్రయించే చిరువ్యాపారుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అటు బీహెచ్ఈఎల్, పటాన్చెరు వంటి దూరప్రాంతాల్లో ఉంటూ హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు.. ఇటు భువనగరి, ఘట్కేసర్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సికింద్రాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి ఎంఎంటీఎస్ ఒక లైఫ్‌లైన్‌లా మారింది. నాంపల్లి, ఖైరతాబాద్, సెక్రటేరియట్, గాంధీభవన్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు ఎంఎంటీఎస్ రైళ్లలోనే పయనిస్తున్నారు. లక్షా 60వేల మందికి సేవలు... పెరుగుతున్న నగర జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2003లో ఎంఎంటీఎస్ సేవలకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ.69.50 కోట్ల వ్యయంతో ఇవి పట్టాలెక్కాయి. తొలుత సికింద్రాబాద్–లింగంపల్లి వరకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీ ఈ సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత సికింద్రాబాద్–ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు ప్రతిరోజు తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60వేల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. బోగీల సంఖ్యను 6–9కి, ఆ తర్వాత 12కు పెంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలిస్కోపిక్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. 2010లో ప్రారంభించిన ‘మాతృభూమి’ మహిళల ప్రత్యేక రైలులో బోగీల సంఖ్యను కుదించినప్పటికీ, 4 బోగీలను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించారు. ఇక రెండో దశ పనులు సైతం తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్, రామంద్రాపురం, తెల్లాపూర్ వరకు వేసిన కొత్త రైల్వే మార్గంలో 2 సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్–బొల్లారం లైన్లు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మార్గాల్లో విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. రెండో దశ పూర్తయితే ఘట్కేసర్, పటాన్చెరు, మేడ్చల్ లాంటి శివారు ప్రాంతాలు నగరానికి చేరువవుతాయి. డీఆర్ఎఫ్ కీలక పాత్ర సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న సంఘటన స్థలానికి జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు అతి తక్కువ సమయంలోనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే 50 మందితో కూడిన మూడు బృందాలు ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, విపత్తుల నివారణ శాఖ సిబ్బందితో కలిసి పని చేశాయి. డీఆర్ఎఫ్ విభాగం వద్దనున్న పరికరాలతోనే ఈ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించాయి. -
కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం కర్నూల్-సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబిన్లో చిక్కుకున్న లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చదవండి: కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఉదయం ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటన దృష్ట్యా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించే వాటిని సికింద్రాబాద్‌కే పరిమితం చేయడంతో సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు వెళ్లవలసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నాంపల్లి నుంచి ఫలక్‌నుమాకు కూడా సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్నింటిని దారిమళ్లించారు. ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. -
లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్ శేఖర్‌ను ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్ వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ -
హైదరాబాద్ : కాచిగూడలో ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్
-
కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ప్యాసెంజర్ (ఇంటర్సిటీ) రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ శేఖర్ ఇంజన్లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలసట లేని ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కాసేపు కునుకు తీసి బయలుదేరే సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. అందుకోసం రిటైరింగ్ రూములను అందుబాటులోకి తెచ్చింది. రిటైరింగ్ రూములను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత కాచిగూడ రైల్వేస్టేషన్‌దే. హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ శుక్రవారం ఈ రిటైరింగ్ రూములను ప్రారంభించి ప్రయాణికులకు అం దుబాటులోకి తెచ్చారు. ఈ రిటైరింగ్ రూముల్లో స్నానాల గదులు, తాగునీరు, మంచాలు, దుప్పట్లు, టీవీ, న్యూస్‌పేపర్లు, ఈజీ చైర్స్, తదితర అన్ని సదుపాయాలు ఉం టాయి. ప్రయాణికులు తమ అవసరాలు, ప్రయాణ సమయానికి అనుగుణంగా గంటల ప్రాతిపదికన చార్జీలు చెల్లించి ఈ విశ్రాంతి గదుల్లో బస చేయవచ్చు. ఇప్పటి వరకు ప్రతి 12 గంటలు, 24 గంటల చొప్పున చార్జీలు విధిస్తుండగా ఐఆర్సీటీసీ నిర్వహించే విశ్రాంతి గదుల్లో మాత్రం గంటల ప్రాతిపదికపై చార్జీలు వసూలు చేస్తారు. ప్రయాణికులు ప్రయాణంతోపాటే రిటైరింగ్ రూమ్‌ను బుక్ చేసుకోవచ్చు. కాచిగూడ స్టేషన్లో దిగిన తరువాత నేరుగా వెళ్లి బుక్ చేసుకోవచ్చు. రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకొనే వారు తమ ప్రయాణ టికెట్‌ను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
మొబైల్ యాప్‌లో ‘రైల్వేస్టేషన్’
సాక్షి, హైదరాబాద్: మీరు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారా? అక్కడ లభించే సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మీరు ఏ సిబ్బందిని సంప్రదించాల్సిన పనిలేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను ఓపెన్ చేస్తే చాలు. స్టేషన్ సేవలు ప్రత్యక్షమవుతాయి. కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న యాప్ సేవలను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ప్రారంభించనున్నారు. ‘రైల్వేస్టేషన్ ఇన్ఫో’అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే 60 ఎంఎంటీఎస్ రైళ్ల టైం టేబుల్, లోకల్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలతోపాటు బుకింగ్, రిజర్వేషన్ సేవలు, విశ్రాంతి గదులు, క్యాంటీన్, హోటళ్లు, టాయిలెట్లు, పోర్టల్ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవ చ్చు. ప్రయాణికుల ఫిర్యాదులపై అధికారుల స్పందన తెలుసుకోవచ్చు. నవరస్ అనే మరో యాప్: స్టేషన్ నేవిగేషన్ సదుపాయం ‘నవ్రస్’ అనే మరో మొబైల్ యాప్ ద్వారా లభిస్తుంది. ఈ నావిగేషన్ సూచీ ఆధారంగా ప్రయాణికులు ఎవరి సాయం లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు నేరుగా వెళ్లిపోవచ్చు. రైల్వేస్టేషన్‌కు కొత్తగా వచ్చే వారికి, పర్యాటకులకు ఈ యాప్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ రెండు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కాచిగూడ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను కూడా జీఎం ప్రారంభించనున్నారు. -
సంక్రాంతి ‘కానుక’.. ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు కాని వారిని నియంత్రించేందుకు కాచిగూడ స్టేషన్లో తాత్కాలికంగా ప్లాట్ఫారం టికెట్ ధర పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయించింది. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని కాచిగూడ స్టేషన్లో పెరగనున్న ప్రయాణీకుల రద్దీతోపాటు వారి వెంట వచ్చే ప్రయాణం చేయని జన సంఖ్యను కూడా అధికారులు ముందుగా అంచనా వేశారు. దీంతో ప్రయాణికులు కానివారిని ప్లాట్‌ఫాంలపైకి ప్రవేశించకుండా క్రమబద్ధీకరించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు కాచిగూడ స్టేషన్లో ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్ఫారం టికెట్టు ధరను జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు రూ.20 లకు పెంచారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి రైల్వే శాఖతో సహకరించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో కోరారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కాచిగూడ: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(27) మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫారం నెంబర్ 1 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని ఒంటిపై క్రీమ్‌కలర్ షర్టు, నలుపు రంగులో చుక్కల ఫ్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
కాచిగూడ (హైదరాబాద్) : మతిస్థిమితం కోల్పోయి రైలు కింద పడబోయిన ఓ మహిళను కాచిగూడ రైల్వే పోలీసులు రక్షించారు. రైల్వే ఇన్స్పెక్టర్ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా రాజంపేట మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య కల్లూరి కళావతమ్మ(42) శుక్రవారం రాజంపేట నుంచి బస్సులో కాచిగూడకు చేరుకుంది. అనంతరం రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుంది. గమనించిన రైల్వే పోలీసులు మహిళను కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోదరుడు రాంచంద్రారెడ్డికి ఆమెను అప్పగించారు. -
రైల్వే స్టేషన్లో ప్రసవించిన మహిళ
హైదరాబాద్(కాచిగూడ): కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం ఉదయం జరగింది. రైల్వే ఇన్స్పెక్టర్ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు ప్రాంతానికి చెందిన మానస (38) పురుటినోప్పులు రావడంతో కాన్పుకోసం నగరంలోని ఆసుపత్రిలో చూపించుకోవడానికి తల్లితో కలిసి వచ్చింది. తాండురులో ఎంఎంటిఎస్ రైలు ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగింది. రైల్వే స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి ఎక్కి నడుచుకుంటూ వస్తుండగా నోప్పులు ఎక్కువై పుట్ ఓవర్‌బ్రిడ్జిపైనే కవల పిల్లలు ఒక బాబు, ఒక పాపకు జన్మనించింది. తల్లి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. రైల్వే పోలీసులు చేరదీసి వారిని చికిత్స నిమిత్తం 108లో గాంధి ఆసుపత్రికి తరలించారు. -
పలు రైళ్ల రాకపోకల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద చేపట్టనున్న నిర్మాణం దృష్ట్యా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి జూన్ 21 వరకు ఈ పనులు కొనసాగుతాయని, అప్పటి వరకు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. మిర్జాపల్లి-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు గంట ఆలస్యంగా, నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ రైలు బొల్లారం వరకే నడుస్తాయి. గుంటూరు-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ మహబూబ్‌నగర్ వరకే నడుస్తుంది. కర్నూలు సిటీ-కాచిగూడ ప్యాసింజర్ ఫలక్‌నుమా వరకే నడుస్తుంది. అలాగే మధ్యాహ్నం 1.10 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్‌కు రాకపోకలు సాగిస్తుంది. ఇది మధ్యాహ్నం 1.28 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరుతుంది. ఈ మార్పుల దృష్ట్యా ఫలక్‌నుమా-ఉందానగర్‌కు ప్రత్యేక రైలు నడుపుతారు. ఇది ఉదయం 6.25కు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి 6.45కు ఉందానగర్‌కు చేరుకుంటుంది. ఉందానగర్‌లో ఉదయం 8.45కు బయలుదేరి ఉదయం 9.05 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది. -
కాచిగూడ స్టేషన్లో కార్డాన్ సెర్చ్
హైదరాబాద్ : నగరంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాత్రి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. స్టేషన్లో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
యువ సేన @ ట్రాన్స్ఫార్మర్స్
చెత్త తీసుకెళ్లేవాడు వస్తేనే ఆరడుగుల దూరంలో నుంచో పెట్టడం... మాసిపోయిన దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు వారిని హీనంగా చూడటం... ఇదీ మన సమాజం తీరు. ఈ సంఘం నుంచి ఫుట్‌పాత్ మీద కునారిల్లుతున్న బతుకులను చూసి అసహ్యించుకోవడమో, ఆమడదూరం నుంచి సాగిపోవడమో తప్ప వారిని ఆప్యాయంగా స్పర్శించే మానవత్వం ఆశించగలమా ? మట్టికొట్టుకుపోతున్న ముఖాలను తుడిచి, కడిగిన ముత్యాల్లా మెరిపించే ప్రేమాభిమానాలను ఊహించగలమా? కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతం..ఆదివారం.. సాయంత్రం 4 గంటలు.. ఫుట్‌పాత్ మీద ఓ వ్యక్తి ఉన్నాడు. చింపిరి జుట్టు.. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం.. అక్కడక్కడా గాయాలు.. ముసిరిన ఈగలు.. అటుగా వెళ్తున్న వారు అతడ్ని చూడగానే దూరంగా జరిగి వెళ్తున్నారు. కొందరు ఈసడించుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ఫుట్‌పాత్‌పై ఏదో ధ్యాసలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించారు. ఏదో చెబుతున్నారు.. అతను వద్దంటున్నాడు (సైగలతోనే). వీరు గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. చుట్టుపక్కల జనాలంతా ఈ తంతును వింతగా చూస్తున్నారు. ఓ అరగంట తర్వాత అతడు సరేననడంతో సీన్ మారిపోయింది. అప్పటికప్పుడు తమ వెంటున్న సరంజామా బయటకు తీశారు. ఒకరు హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోతే, మరొకరు ఆస్పత్రిలో నర్స్ విధులను మొదలుపెట్టారు. ఒకరు వెంట తెచ్చిన క్యారియర్ నుంచి ఫుడ్ తీసి సిద్ధం చేస్తుంటే.. ఇంకొకరు ఓ వారానికి సరిపడా.. మందులు, సబ్బులు వంటివి కిట్‌లో సర్దుతున్నారు. ‘మమత కరువై.. మనుషుల మధ్యే మానుల్లా మనుగడ సాగిస్తున్న వారి జీవితాలు శిథిలమైపోతుంటే మౌనంగా ఉండటం సరైనదేనా..?’.. ఈ ప్రశ్నకు సమాధానంగా అవతరించిందే ‘ట్రాన్స్ఫార్మర్స్’. ఫుట్‌పాత్‌పై తెల్లారిపోతున్న బతుకులకు కాసింత వెలుగు ప్రసాదించడానికి నగర యువత తీసుకొచ్చిన కాంతిపుంజం. ఆదివారం అంటే ఆనందం అనుకునే ఈ తరం యువతకు కాస్త భిన్నంగా హాలిడేను హార్ట్ టచింగ్ డేగా కూడా మార్చుకుంటున్నారు వారు. మ్యూజిక్ బాండ్ నుంచి యంగిస్థాన్ వరకు.. నగరానికి చెందిన అరుణ్ డేవిడ్ మరికొందరు మిత్రులతో కలసి టేకెన్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించేవారు. ‘అప్పడు మేం చాలా కన్సర్ట్స్‌లో సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి పాటలు పాడేవాళ్లం. వాటికి ఇన్స్పైర్ అయిన వారు.. ఏం చేయాలని అడిగేవారు. అప్పుడే ఓ వేదిక స్థాపించాలనుకున్నాం. అలా ఓ ఐదుగురం కలసి 2012 మార్చిలో యంగిస్థాన్ స్టార్ట్ చేశాం’ అని తమ తొలి అడుగులను గుర్తు చేసుకున్నారు అరుణ్. ప్రస్తుతం ఇందులో 120 మంది రిజిస్టర్ట్ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం వీరు సమావేశమవుతారు. వారానికో వాలంటరీ ఇంట్లో వంట చేయించి 1,000 మంది నిర్భాగ్యులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి శనివారం కనీసం ఐదు అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతారు. ఇదే కోవలో ఈ యువసేన వేసిన మరో ముందడుగే ట్రాన్స్ ఫార్మర్స్. ఆలోచన వెనుక.. ఫుట్‌పాత్ మీద అపరిశుభ్రంగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన కలిగిందని యంగిస్థాన్ సభ్యుడు రోహిత్ చెబుతాడు. ‘పగబట్టిన విధి వీరిని విగత జీవులుగా మార్చేసింది. నెలలు కాదు ఏళ్లకేళ్లు వీళ్లు స్నానం చేయరు. వీరి జీవితాలను ఎందుకు మార్చకూడదు అనిపించింది అనుకున్న’ ఈ యువత కాచిగూడ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్ మీదున్న ఓ వృద్ధుడి మేకోవర్‌తో ‘ట్రాన్స్ఫార్మర్స్’గా తొలి అడుగు వేసింది. ‘అపరిశుభ్రంగా ఉన్న ఆ వృద్ధుడ్ని ఎంతో బతిమాలితే గాని ఒంటి మీద చేయి వేయనీయలేదు. అతనికి ట్రిమ్ చేసి.. స్నానం చేయించి.. ఫొటో తీసి చూపిస్తే.. ఆయన దాన్ని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని చెప్పుకొచ్చారు ఆ యువకులు. వారానికి ఐదుగురు వీరిలో వారానికి ఐదుగురు బ్యాచ్ చొప్పున ట్రాన్స్ఫార్మర్స్ అవతారమెత్తుతున్నారు. హెయిర్ కటింగ్, ప్రాథమిక చికిత్స మెళకువలు నేర్చుకుంటు న్నారు. ‘మేకోవర్‌కు గంట పడుతోంది. కొందరి వెంట్రుకల్లో పురుగులుంటాయి. కొందరి జుట్టు కట్ చేయడానికి వీలులేకుండా ఉంటాయ’ని గుర్తు చేసుకుంటూ ఆ అభాగ్యజీవుల బతుకులపై వీరికున్న సానుభూతి వ్యక్తమైంది. అలా వదిలేయకుండా.. ‘ఈ ఫుట్‌పాత్ జీవులలో వృద్ధులే ఎక్కువ. పిల్లల ఆదరణ లేని వారు, రోడ్డు ప్రమాదాలకు గురై మానసికంగా దెబ్బతిన్నవారు.. ఇలా ఎందరో ఉన్నారు. వీరిని మేకోవర్ పూర్తయ్యాక వదిలేయకుండా ట్రైనింగ్ సెంటర్స్‌కు పంపాలని ఆలోచనలో ఉన్నాం. రిహాబిలిటేషన్, స్కిల్ ట్రైనింగ్, షెల్టర్ హౌస్‌కు కూడా ప్లాన్ చేస్తున్నాం. సులభ్ వారితో మాట్లాడి వారికో శాశ్వతమైన ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాం’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారీ మిత్రబృందం. ‘ది సోల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ’ అన్న లియో టాల్‌స్టాయ్ మాటల్నే తమ చేతలకు ప్రాతిపదికగా చెబుతున్న ఈ స్నేహితులు చేస్తున్న సేవ.. యువత నడతకు కొత్త భాష్యం.