కాచిగూడ (హైదరాబాద్) : మతిస్థిమితం కోల్పోయి రైలు కింద పడబోయిన ఓ మహిళను కాచిగూడ రైల్వే పోలీసులు రక్షించారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా రాజంపేట మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య కల్లూరి కళావతమ్మ(42) శుక్రవారం రాజంపేట నుంచి బస్సులో కాచిగూడకు చేరుకుంది. అనంతరం రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుంది. గమనించిన రైల్వే పోలీసులు మహిళను కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోదరుడు రాంచంద్రారెడ్డికి ఆమెను అప్పగించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
Published Fri, Jul 3 2015 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement