
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ప్యాసెంజర్ (ఇంటర్‌సిటీ) రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ శేఖర్ ఇంజన్‌లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment