కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
కాచిగూడ: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(27) మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫారం నెంబర్ 1 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని ఒంటిపై క్రీమ్‌కలర్ షర్టు, నలుపు రంగులో చుక్కల ఫ్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.