Unidentified Person
-
ఫోన్ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..
సాక్షి, పెనమలూరు: మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే... తాడిగడప శ్రీనివాసానగర్ కాలువ కట్టకు చెందిన దోనేపూడి వరలక్ష్మి, ఆమె భర్త నాగరాజు ఉంటున్నారు. ఆమెకు విజయవాడ గురునానక్‌నగర్‌లో ఎస్బీఐలో ఖాతా ఉంది. అయితే బుధవారం ఉదయం ఆమెకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను ఎస్బీఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నానని, ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిందని, రెన్యూవల్ చేయాలని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె కార్డు వివరాలు తెలిపింది. ఇంతలో ఫోన్‌కు ఓటీపీ రాగా ఆ వివరాలు కూడా ఆమె ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పింది. కొద్ది క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 సొమ్ము డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి ఆమె బ్యాంకు అధికారులకు తెలిపి ఏటీఎం కార్డు బ్లాక్ చేయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు సీఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేపట్టారు. -
బూచోడు కాదు.. పక్కూరోడే!
అమరచింత (కొత్తకోట) : సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పుకార్లతో నేటికీ గ్రామాల్లో భయాందోళనలు తొలగడం లేదు. బూచోలొచ్చారని, చంటిపిల్లలను ఎత్తుకెళ్లి చంపుతారని భయపడుతున్న తరుణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి యాచిస్తూ సంచరిస్తున్న సమయంలో యువకులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దకడ్మూర్ గ్రామానికి చెందిన బుడగజంగాల కృష్ణ గురువారం అమరచింతకు వచ్చి భిక్షాటన చేశాడు. రాత్రివేళలో స్వగ్రామానికి వెళ్లడానికి అమరచింత బస్టాండ్‌కు రాగా అప్పటికే పెద్దకడ్మూర్ బస్సు గ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఆకలితో ఉన్న కృష్ణ స్థానిక సయ్యద్నగర్కాలనీలో భిక్షమెత్తుకున్నాడు. ఈ తరుణంలో కాలనీకి చెందిన యువకులు పిల్లలెత్తుకెళ్లే దొంగగా ఉన్నాడంటూ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి అపరిచిత వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విచారించగా బుడగజంగాల కృష్ణ పెద్దకడ్మూర్కు చెందిన వ్యక్తిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా.. తమ గ్రామానికి చెందిన వాడని చెప్పడంతో పోలీసులు కృష్ణను పెద్దకడ్మూర్కు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. -
గుర్తుతెలియని వ్యక్తి హత్య
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో పాడుబడిన ఓ పాఠశాల గదిలో 48 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పాడుబడిన పాఠశాల గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారంరోజుల క్రితం చనిపోయి ఉండటంతో శరీరం దుర్వాసన వస్తోంది. నుదుటిపై, కాళ్లపై గాయాలున్నాయి. హత్య చేసిన అనంతరం యాసిడ్ పోసి శరీరాన్ని కాల్చినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయన్నారు. -
బాలికకు టిఫిన్ తినిపిస్తానని తీసుకెళ్లి..
వికారాబాద్: జిల్లాలోని తాండూరులో ఘోరం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఓ చిన్నారిని టిఫిన్ చేపిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. వివరాలు.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన ఓ బాలిక(7) తన నానమ్మతో కలిసి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామిర్శించేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఒంటిరిగా కూర్చున్న బాలికను ఓ యువకుడు టిఫిన్ తినిపిస్తానని చెప్పి శనివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. రాత్రైనా బాలిక ఆచూకి లభించకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులకు చెట్ల పొదల్లో నుంచి ఓ బాలిక మూలుగులు వినిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. కార్మికుల చప్పుడు విన్న యువకుడు బాలికను అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గురువారం ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. పెరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి శ్రీవారికి రూ. 2 కోట్లు విరాళం అందజేశాడు. ఆ డబ్బును అన్న ప్రసాదానికి వినియోగించాలని కోరాడని ఆలయ అధికారులు తెలిపారు. -
నాలాలో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని శవం
మల్కాజ్గిరి చంద్రబాబు నగర్ నాలాలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (పురుషుడు) మృతదేహం కొట్టుకువచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బండచెరువు నిండి నీళ్లు వస్తున్నాయి. చెరువు నీళ్లలో మృతదేహం కొట్టుకు వచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్కాజ్గిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
చికిత్సపొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఫుట్‌పాత్‌పై అపస్మారక స్థితిలో ఉన్నవున్న ఓ గుర్తు తెలియనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం ఓ 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ఓల్డ్‌జైల్‌ఖాన ప్రాంతంలో అపస్మారకస్థితిలో పడివున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు 108 సహాయంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ రాత్రి ఆయన మరణించారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కానీ 040-27853598, 908395689 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
జైనత్ మండలం మాకోడా గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. -
విద్యార్థినిపై దుండగుడి దాడి
గుంటూరు: గుంటూరు నాజ్ సెంటర్లో గురువారం ఉదయం ఓ విద్యార్ధినిపై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. వెంకటరమణ(20) అనే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తలపై సుత్తితో కొట్టి ఓ దుండగుడు పరారయ్యాడు. విద్యార్థిని ఉదయం కాలేజీకి వెళ్తున సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను సీటీ స్కాన్‌కు పంపారు. బాధితురాలి స్వగ్రామం తుళ్లూరు మండలం మందడం గ్రామం. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవటంతో బాబాయి సంరక్షణలో ఉంటోంది. ప్రస్తుతం గుంటూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజిని పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య
పాతబస్తిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బహాదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడిమీర్ ఆలం చెరువు వద్ద ఆదివారం వెలుగుచూసింది. చెరువు సమీపంలోని పొదల్లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. -
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
బూర్గంపాడు (ఖమ్మం) : గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కాచిగూడ: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(27) మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫారం నెంబర్ 1 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుని ఒంటిపై క్రీమ్‌కలర్ షర్టు, నలుపు రంగులో చుక్కల ఫ్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి
అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం నుంచి అలాగే పడుకుని ఉండటంతో అనుమానం వచ్చి స్థానికులు సాయంత్రం తట్టి చూడగా ఒంట్లో ప్రాణం లేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఉంటుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండ్‌లో గుర్తుతెలియని వృద్ధుని మృతి
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న వృద్ధుడు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. కాగా మంగళవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలో హఠాత్తుగా మృతిచెందాడు. గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పంచాయతీవారికి అప్పగించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
కరీంనగర్ : గుర్తుతెలియని యువకుడు(27) దారుణ హత్యకు గురయ్యాడు. కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి కిరాతకంగా గొంతు కోసి చంపారు కొందరు దుండగులు. కాగా ఈ దారుణాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
సరూర్ నగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని మారుతి నగర్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి నగర్ చివరి బస్టాప్‌కు దగ్గరలోని ఓ ఖాళీ స్థలంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి లుంగీతో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నేరేడుకొండ (ఆదిలాబాద్ జిల్లా) : గుర్తుతెలియని ఒక వ్యక్తి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలం గౌలీగూడ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు చెట్టుకు వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
హన్మకొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా హన్మకొండ మండలంలోని మామునూర్లో జరిగింది. వివరాలు..వరంగల్-ఖమ్మం రహదారిపై ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతనిని ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీ కొని వెళ్లిందా? లేదా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై వేసి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, మృతుని శరీరం రోడ్డుపై నుజ్జునుజ్జు అయ్యి, చిందరవందరగా పడి ఉంది. అంతేకాకుండా మృతుడిని గుర్తుపట్టలేని విధంగా ఉంది. విషయం తెలిసిన మామునూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అటవీ ప్రాంతంలో హత్య?
బిట్రగుంట : బోగోలు మండలం కొండబిట్రగుంట సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరువగా ఉన్న సిరిగోల్డ్ లేఅవుట్లో గుర్తుతెలియని వ్యక్తి (30) హత్యకు గురైనట్లు తెలుస్తోంది. బుధవారం అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు అటుగా వెళుతున్న స్థానిక గిరిజనులు లేఅవుట్ ప్రాంతంలోని ముళ్ల చె ట్లలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. రోడ్డుకు దూరంగా లేఅవుట్ చివరి ప్రాంతంలో రైల్వేట్రాక్‌కు సమీపంలో మృతదేహం పడి ఉంది. విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, సంఘటన స్థలాన్ని బట్టి హత్యగా అనుమానిస్తున్నారు. మొహం కూడా గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌మీద పడేసే ఉద్దేశంతో చిల్లచెట్ల వరకు తీసుకువచ్చి, వీలు కుదరకపోవడంతో వదిలేసి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ విషయమై ఎటువంటి సమాచారం అందలేదని బిట్రగుంట పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మెడపై నరికి.. గొంతుకోసి..
గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య మోత్కూర్ మండలంలో ఘటన మోత్కూరు: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని పొడిచేడు గ్రామశివారు మర్రిగడ్డ సమీపంలో బండపై మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ ఆళ్లగిరి వ్యవసాయ క్షేత్రంలోని బండ సమీపంలోకి వెళ్లేసరికి రక్తపు మడుగులో మృతిచెందిన వ్యక్తి కనిపించాడు. వెంటనే విషయాన్ని గ్రామ వీఆర్ఏకు తెలిపారు. ఆయన స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రామన్నపేట సీఐ ఏ.బాలగంగిరెడ్డి, మోత్కూరు ఎస్ఐ సి.పురేందర్‌భట్‌లు ఘటన స్థలా న్ని పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు సేకరించారు. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో మెడపై నరికి, గొం తుకోసి దారుణంగా చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. మృతు డు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట గ్రామానికి చెందిన సత్యనారయణగా భావి స్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాన్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. అన్ని కో ణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.