బూర్గంపాడు (ఖమ్మం) : గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.