అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | unidentified person dies in road accident | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Published Mon, Apr 13 2015 8:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

unidentified person dies in road accident

హన్మకొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా హన్మకొండ మండలంలోని మామునూర్‌లో జరిగింది. వివరాలు..వరంగల్-ఖమ్మం రహదారిపై ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతనిని ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీ కొని వెళ్లిందా? లేదా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై వేసి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, మృతుని శరీరం రోడ్డుపై నుజ్జునుజ్జు అయ్యి, చిందరవందరగా పడి ఉంది. అంతేకాకుండా మృతుడిని గుర్తుపట్టలేని విధంగా ఉంది.

విషయం తెలిసిన మామునూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement