వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు.
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న వృద్ధుడు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు.
కాగా మంగళవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలో హఠాత్తుగా మృతిచెందాడు. గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పంచాయతీవారికి అప్పగించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.