గుంటూరు: గుంటూరు నాజ్ సెంటర్‌లో గురువారం ఉదయం ఓ విద్యార్ధినిపై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. వెంకటరమణ(20) అనే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తలపై సుత్తితో కొట్టి ఓ దుండగుడు పరారయ్యాడు.
విద్యార్థిని ఉదయం కాలేజీకి వెళ్తున సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను సీటీ స్కాన్కు పంపారు. బాధితురాలి స్వగ్రామం తుళ్లూరు మండలం మందడం గ్రామం. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవటంతో బాబాయి సంరక్షణలో ఉంటోంది. ప్రస్తుతం గుంటూరు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజిని పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
విద్యార్థినిపై దుండగుడి దాడి
Published Thu, Dec 17 2015 10:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement