సాక్షి, హైదరాబాద్: మీరు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారా? అక్కడ లభించే సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మీరు ఏ సిబ్బందిని సంప్రదించాల్సిన పనిలేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను ఓపెన్ చేస్తే చాలు. స్టేషన్ సేవలు ప్రత్యక్షమవుతాయి. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న యాప్ సేవలను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ప్రారంభించనున్నారు. ‘రైల్వేస్టేషన్ ఇన్ఫో’అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే 60 ఎంఎంటీఎస్ రైళ్ల టైం టేబుల్, లోకల్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలతోపాటు బుకింగ్, రిజర్వేషన్ సేవలు, విశ్రాంతి గదులు, క్యాంటీన్, హోటళ్లు, టాయిలెట్లు, పోర్టల్ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవ చ్చు. ప్రయాణికుల ఫిర్యాదులపై అధికారుల స్పందన తెలుసుకోవచ్చు.
నవరస్ అనే మరో యాప్: స్టేషన్ నేవిగేషన్ సదుపాయం ‘నవ్‌రస్’ అనే మరో మొబైల్ యాప్ ద్వారా లభిస్తుంది. ఈ నావిగేషన్ సూచీ ఆధారంగా ప్రయాణికులు ఎవరి సాయం లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు నేరుగా వెళ్లిపోవచ్చు. రైల్వేస్టేషన్‌కు కొత్తగా వచ్చే వారికి, పర్యాటకులకు ఈ యాప్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ రెండు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే కాచిగూడ స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 400 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను కూడా జీఎం ప్రారంభించనున్నారు.
మొబైల్ యాప్‌లో ‘రైల్వేస్టేషన్’
Published Thu, Mar 22 2018 3:44 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment