Railway GM Vinod
-
డెమో రైలును కర్నూలు వరకూ పొడిగించండి
సాక్షి కడప : కర్నూలు నగరంలో డిసెంబరు నెల 8 నుంచి 10వ తేదీ వరకు ముస్లిం సోదరుల ఆలమి దీని ఇజ్‌తెమ (ఆ«ధ్యాత్మిక సమ్మేళనం) కార్యక్రమం జరగనుందని...అందుకు సంబంధించి కడపతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ముస్లిం సోదరులకు అనువుగా ఉండేలా ప్రస్తుతం నడుస్తున్న డెమో రైలును కర్నూలు వరకు పొడిగించాలని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని రైల్వే నిలయంలో సౌత్ సెంటల్ర్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌తో మాజీ ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 నుంచి 25 లక్షల మంది ఆలమి దీని ఇజ్‌తెమకు వస్తారని...ఈ నేపథ్యంలో కడప–నంద్యాల, నంద్యాల–కడప మధ్య నడుస్తున్న డెమో రైలును కర్నూలు వరకు పొడిగించడం ద్వారా ముస్లిం సోదరులు వెళ్లడానికి, రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా వెళుతున్న రైలులో నంద్యాల వరకు వెళుతున్న వారికి కర్నూలు వరకు అవకాశం కల్పించడం ద్వారా మూడు రోజులు ముస్లిం సోదరులకు వెసులుబాటు కల్పించినట్లుంటుందని ఆయన తెలియజేశారు. డిసెంబరు 7వ తేది నుంచే పొడిగింపునకు చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల నుంచి వేలల్లో ముస్లిం సోదరులు ఈ రైలు ద్వారా ప్రయాణం చేసేందుకు అనువుగా ఉంటుందని ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే బోర్డు మీటింగ్‌లో చర్చించి పొడిగింపుకు తగిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి హామి ఇచ్చారు. -
‘లోకమాన్య’ను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ –ముంబై మధ్య నడుస్తున్న లోక మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని నిజామాబాద్ ఎంపీ కవిత దక్షిణæ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ వరకు రైలును పొడిగించడం వల్ల కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ముంబై వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో అదనంగా ఫ్లాట్‌ఫారాలను నిర్మించాలని ఎంపీ కోరారు. -
మొబైల్ యాప్‌లో ‘రైల్వేస్టేషన్’
సాక్షి, హైదరాబాద్: మీరు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారా? అక్కడ లభించే సేవల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మీరు ఏ సిబ్బందిని సంప్రదించాల్సిన పనిలేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ను ఓపెన్ చేస్తే చాలు. స్టేషన్ సేవలు ప్రత్యక్షమవుతాయి. కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న యాప్ సేవలను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం ప్రారంభించనున్నారు. ‘రైల్వేస్టేషన్ ఇన్ఫో’అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే 60 ఎంఎంటీఎస్ రైళ్ల టైం టేబుల్, లోకల్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలతోపాటు బుకింగ్, రిజర్వేషన్ సేవలు, విశ్రాంతి గదులు, క్యాంటీన్, హోటళ్లు, టాయిలెట్లు, పోర్టల్ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవ చ్చు. ప్రయాణికుల ఫిర్యాదులపై అధికారుల స్పందన తెలుసుకోవచ్చు. నవరస్ అనే మరో యాప్: స్టేషన్ నేవిగేషన్ సదుపాయం ‘నవ్రస్’ అనే మరో మొబైల్ యాప్ ద్వారా లభిస్తుంది. ఈ నావిగేషన్ సూచీ ఆధారంగా ప్రయాణికులు ఎవరి సాయం లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు నేరుగా వెళ్లిపోవచ్చు. రైల్వేస్టేషన్‌కు కొత్తగా వచ్చే వారికి, పర్యాటకులకు ఈ యాప్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ రెండు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కాచిగూడ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను కూడా జీఎం ప్రారంభించనున్నారు. -
ఎండా, వానలతో జాగ్రత్త: రైల్వే జీఎం వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెల, వచ్చే వానాకాలాలను దృష్టిలో ఉంచుకు ని నిరంతరం జాగరూకతతో వ్యవహ రించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో అన్ని డివిజన్ల డీఆర్ఎంలు, ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 20 రోజుల్లో ఎండ తీవ్రత గరిష్టంగా ఉండనున్నందున పట్టాల పగుళ్లు, జాయింట్ల వెల్డింగులు పరిశీలించాలన్నారు. వానాకాలంలో మెరుపు వరదలను అధిగమించేం దుకు ప్రణాళికలు అవసరమని పేర్కొ న్నారు. అప్రమత్తంగా వ్యవహరించి నందుకు గాను విజయవాడ డివిజన్ తాడేపల్లి గూడేనికి చెందిన ఉద్యోగి శ్రీనివాసరావుకు జీఎం ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.