
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ –ముంబై మధ్య నడుస్తున్న లోక మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని నిజామాబాద్ ఎంపీ కవిత దక్షిణæ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ వరకు రైలును పొడిగించడం వల్ల కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ముంబై వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో అదనంగా ఫ్లాట్‌ఫారాలను నిర్మించాలని ఎంపీ కోరారు.